తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలోని ప్రవాస భారతీయుల్లో 6.5 శాతం నిరుపేదలే!

అమెరికాలోని ప్రవాస భారతీయల్లో 6.5 శాతం మంది దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారితో మరింత మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని పేర్కొంది.

Indian-Americans
అమెరికాలోని ప్రవాస భారతీయులు

By

Published : Oct 2, 2020, 11:16 AM IST

అగ్రరాజ్యం అమెరికాలోని 4.2 మిలియన్ల మంది భారతీయ అమెరికన్లలో దాదాపు 6.5 శాతం మంది నిరుపేదలేనని, దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నారని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. కరోనా మహమ్మారితో మరింత మంది పేదరికంలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

జాన్స్​ హాప్కిన్స్​ పాల్​ నిట్జ్​ స్కూల్​ ఆఫ్​ అడ్వాన్స్​డ్​ ఇంటర్నేషన్​ స్టడీస్​కు చెందిన దేవేశ్​ కపుర్​, జషన్​ భజ్వాత్​లు 'భారతీయ అమెరికన్లలో పేదరికం' అనే పేరుతో నివేదిక రూపొందించారు. గురువారం జరిగిన 'ఇండియాస్పొరా ఫిలాంథ్రపీ సదస్సు- 2020' సందర్భంగా నివేదికను విడుదల చేశారు.

" నిరుపేద భారతీయ అమెరికన్ల పరిస్థితిపై శ్రద్ధ చూపడానికే ఈ నివేదికను విడుదల చేశాం. కొవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. ఇలాంటి సమయంలో ఇండో అమెరికన్ల పేదరికం గురించి చర్చించడం చాలా మంచి విషయం. పరిస్థితిని మెరుగుపర్చడానికి ఈ నివేదిక ఉపయోగపడుతుంది "

- ఎమ్​ఆర్. రంగస్వామి, ఇండియాస్పొర వ్యవస్థాపకులు

బెంగాలీ, పంజాబీలే అధికం..

బెంగాలీ, పంజాబీ మాట్లాడే భారతీయ అమెరికన్లలోనే పేదరికం ఎక్కువగా ఉందని కపూర్ పేర్కొన్నారు. ఈ నివేదిక ద్వారా భారతీయ అమెరికన్ల పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. కానీ, నల్లజాతి, శ్వేత జాతి అమెరికన్లతో పోలిస్తే భారతీయ అమెరికన్లు పేదరికంలో జీవించడానికి మెుగ్గు చూపరని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: సలహాదారుకు కరోనా- క్వారంటైన్​కు ట్రంప్​ దంపతులు!

ABOUT THE AUTHOR

...view details