తెలంగాణ

telangana

ETV Bharat / international

టెక్సాస్​ నిర్బంధ కేంద్రంలో 4,000 మంది వలసదారులు! - టెక్సాస్​ డిటెన్స్​న్​ కేంద్రాల్లో 4000 పైగా వలసదారులు

అమెరికా సరిహద్దుల్లో వలసలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జో బైడెన్​ సర్కారుపై ఒత్తిడి పెరిగింది. వలసదారులపై అనుసరిస్తున్న విధానాల్లో పారదర్శకతను బయటి ప్రపంచానికి చూపడానికి నిర్బంధ కేంద్రాల్లోకి మొదటిసారిగా జర్నలిస్టులకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. దాదాపు నాలుగువేల మందికి పైగా వలసదారులు అమెరికా, మెక్సికో సరిహద్దుకు చేరుకున్నారు. అందులో పిల్లలే అధికంగా ఉన్నారు.

4,000 migrants crowded into Texas facility
సరిహద్దుల్లో వలసల తీవ్రత పెరుగుదలతో బైడెన్​ సర్కారుపై ఒత్తిడి

By

Published : Mar 31, 2021, 7:14 AM IST

Updated : Mar 31, 2021, 7:58 AM IST

సరిహద్దుల్లోని డిటెన్షన్​ కేంద్రాల్లో వలసదారులతో నెలకొన్న రద్దీ పరిస్థితుల తీవ్రతను తెలపడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ యంత్రాంగం తొలిసారిగా జర్నలిస్టులకు అనుమతినిచ్చింది. అక్కడ 4000 పైగా వలసదారులతో నిర్బంధ కేంద్రాలు రద్దీగా ఉన్నాయి. పిల్లలతో సహా కుటుంబాలు నిర్బంధ కేంద్రాల్లోకి ప్రవేశించారు. ఇందులో అధికంగా చిన్నారులే ఉన్నారు.

అమెరికా, మెక్సికో సరిహద్దుకు గత వారంలో వేలకొలది వలస కుటుంబాలు చేరుకున్నాయి. వలసల పారదర్శకతపై బైడెన్​పై ఒత్తిడి పెరిగింది. దీంతో టెక్సాస్​, డొన్నాలోని డిటెన్సన్​ కేంద్రంలో సదుపాయాల పారదర్శకత కోసం సరిహద్దు భద్రతా, కస్టమ్స్​ అధికారులు ఇద్దరు జర్నలిస్టులకు అనుమతినిచ్చారు. 250 మంది మాత్రమే ఉండగలిగే కేంద్రాల్లో దాదాపు 4,100 మంది వలసదారులు ఉన్నారు.

పిల్లలను ఆరోగ్య సేవల విభాగం అధికారులు ఏర్పాటు చేసిన కేంద్రాల్లోకి తీసుకురావడానికి ముందు గుడారాల్లో ఉంచుతున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం పిల్లలను చిన్న గదుల్లోకి తీసుకుపోతున్నారు. కరోనా లక్షణాలు ఉంటే తప్పా కొవిడ్​ పరీక్షలు నిర్వహించట్లేదు. ఆత్మహత్య చేసుకోవడం వంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అని నర్సులు మానసిక పరీక్షలు చేస్తున్నారు. మరో గదికి తీసుకెళ్లి ఇమ్మిగ్రేషన్​ కోర్టుకు హాజరవ్వాలని నోటీసులు జారీ చేస్తున్నారు. వలస పిల్లల బంధువులెవరైనా అమెరికాలో ఉంటే వారితో ఫోన్​లో మాట్లాడిస్తున్నారు. పిల్లల ఆరోగ్య నివేదిక సూచించే బార్​కోడ్ ఉన్న బ్రాస్​లెట్​ను ఇస్తున్నారు. ప్రతిరోజు 250 నుంచి 300 మంది పిల్లలకు పైగా సరిహద్దు దాటుతున్నారని రియో గ్రాండే లోయలో సరిహద్దు పెట్రోలింగ్​ ఉన్నతాధికారి వెల్లడించారు.

ఇదీ చదవండి:మయన్మార్​తో అమెరికా ట్రేడ్ డీల్ రద్దు

Last Updated : Mar 31, 2021, 7:58 AM IST

ABOUT THE AUTHOR

...view details