తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా స్థావరాలపై దాడిని ఖండించిన అగ్రరాజ్యం

ఇరాక్​లోని అమెరికా సైనిక స్థావరాలపై ఆదివారం రాత్రి జరిగిన దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్​ పాంపియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటన బాధ్యులను త్వరగా పట్టుకోవాలని కోరారు.

By

Published : Jan 13, 2020, 10:49 AM IST

outraged-over-attack-on-iraqi-airbase-housing-us-troops-says-pompeo
అమెరికా స్థావరాలపై దాడిని ఖండించిన అగ్రరాజ్యం

ఇరాక్‌లో అమెరికా సైనికులు ఉన్న స్థావరాలపై ఆదివారం జరిగిన దాడిని అగ్రరాజ్యం తీవ్రంగా ఖండించింది. తాజా చర్యపై.. ఆ దేశ విదేశాంగమంత్రి మైక్‌ పాంపియో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి వెనక ఉన్న వారిని వీలైనంత త్వరగా పట్టుకోవాలని ఇరాక్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఇరాక్‌ ప్రభుత్వానికి విధేయులుగా లేని కొంతమంది ఆ దేశ సార్వభౌమత్వంపై తరచూ దాడి చేస్తున్నారని.. దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఇరాక్‌లోని ప్రభుత్వ వ్యతిరేకులే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఇరాక్‌లో అమెరికా బలగాలు మోహరించిన ఒక సైనిక స్థావరంపై ఆదివారం మరోసారి రాకెట్‌ దాడి జరిగింది. బాగ్దాద్‌ సమీపంలోని అల్‌-బలాద్‌ వైమానిక స్థావరంపై ఆదివారం 8 రాకెట్లు పడ్డాయి. ఇందులో ఇరాక్‌ వైమానిక దళానికి చెందిన నలుగురు గాయపడ్డారు. ఇక్కడ కొద్ది సంఖ్యలో అమెరికా సైనికులు, కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇరాన్‌తో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో అమెరికా బలగాలు దాదాపుగా ఈ స్థావరాన్ని ఖాళీ చేశాయి.

ABOUT THE AUTHOR

...view details