అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ అభ్యర్థి జో బైడెన్ మధ్య ఓవైపు మాటల యుద్ధం నడుస్తోంది. ఇలాంటి సమయంలో డెమొక్రాట్ సెనేటర్, ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న కమలా హ్యారిస్ పేరును ఓ ర్యాలీలో వ్యంగ్యంగా ఉచ్ఛరించారు జార్జియాకు చెందిన రిపబ్లికన్ సెనేటర్ డేవిడ్ పెర్డ్యూ. శుక్రవారం జార్జియాలో జరిగిన ఓ ప్రచారంలో ఈ సంఘటన జరిగింది.
కమల పేరును తప్పుగా పలికిన సెనేటర్- నెటిజన్లు ఫైర్
కమలా హ్యారిస్.. అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మారుమోగుతున్న పేరు. ఈ ఏడాది డెమొక్రాట్ల తరఫున ఆమె ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్నారు. అలాంటి మహిళ పేరును తప్పుగా ఉచ్ఛరించి, భారతీయ అమెరికన్ల ఆగ్రహానికి గురయ్యారు రిపబ్లికన్ సెనేటర్ డేవిడ్ పెర్డ్యూ.
కమలా పేరును తప్పుగా పలికిన సెనేటర్.. నెటిజన్లు ఫైర్
ఇది సభలోని రిపబ్లికన్లకు నవ్వులు పూయించగా.. బైడెన్, హ్యారిస్ మద్దతుదారులు మాత్రం డేవిడ్‌పై మండిపడుతున్నారు. కమల మూలలను ఉద్దేశంచి చేసిన విమర్శనేనని ధ్వజమెత్తుతున్నారు. 'మై నేమ్ ఈజ్', 'ఐ స్టాండ్ విత్ కమలా' పేర్లతో ఆన్లైన్ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు హ్యారిస్ మద్దతుదారులు. అనేక మంది భారతీయ అమెరికన్లు ఆ హ్యాష్‌ట్యాగ్‌లతో తమ పేర్లు, వాటి అర్థాలను ట్వీట్ చేస్తున్నారు.
ఇదీ చూడండి:అధ్యక్ష పోరు: భారతీయ సంతతి మొగ్గు ఎటువైపు?