విశ్వం గురించి అధ్యయనం చేయడంలో కీలక పాత్ర పోషించిన హబుల్ స్పేస్ టెలిస్కోప్లో సాంకతిక సమస్య తెలత్తింది. టెలిస్కోప్లోని పేలోడ్ కంప్యూటర్లో ఈ సమస్య ఏర్పడినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తెలిపింది.
జూన్ 13 (ఆదివారం) సాయంత్రం 4 గంటల నుంచి ఈ కంప్యూటర్ పని చేయడం ఆగిపోయినట్లు తెలిపింది నాసా. సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక బృందాలు కృషి చేస్తున్నట్లు వెల్లడించింది.
సమస్యకు అదే కారణమా?
స్టోరేజీలో సాంకేతిక సమస్య వల్లే ఇలా జరిగిందా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు నాసా వివరించింది. బ్యాకప్ మోడ్యూల్స్లో ఒకదాన్ని ప్రత్యమ్నాయంగా మార్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక కూడా ఒక రోజు గడిచిన తర్వాతే సమస్య తొలగిందని భావించనున్నట్లు చెప్పింది. అప్పుడు మాత్రమే టెలిస్కోప్ ఇతర ఆపరేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది.