తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫేస్​బుక్​ వాడాడు... పోలీసులకు దొరికేశాడు

మూడేళ్లు పోలీసుల కళ్లుగప్పాడు ఓ నిందితుడు. రాష్ట్రం మార్చి హాయిగా జీవిస్తున్నాడు. అనుకోకుండా చేసిన చిన్న తప్పుతో కటకటాల పాలయ్యాడు. ఓ టీవీ ఛానల్​కు ఫేస్​బుక్​లో మెసేజ్​ పెట్టడమే అతడు చేసిన పొరపాటు.

By

Published : May 16, 2019, 10:11 AM IST

కెనడా ఫుజిటీవ్​

కెనడాలోని ఓ మోస్ట్​ వాంటెడ్​ నేరస్థుడి విచిత్ర కథ ఇది. మూడేళ్లుగా పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతూ.. ఫేస్​బుక్​లో ఓ మెసేజ్​ పెట్టి అడ్డంగా దొరికిపోయాడు. అతడున్న ప్రదేశాన్ని జీపీఎస్​ సాయంతో కనుగొన్న పోలీసులు.. చేతులకు సంకెళ్లతో సత్కారం చేశారు.

జెస్సీ డీన్​ కొవాల్చక్​.. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రానికి చెందినవాడు. మూడు వేర్వేరు నేరాల్లో నిందితుడు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పక్క రాష్ట్రమైన ఆల్బెర్టాకు పారిపోయాడు. మూడేళ్లు గడిచింది. అంతా మరచిపోయి ఉంటారని సంతోషంగా ఉన్నాడు జెస్సీ.

ఇంతలో ఓ టీవీ వెబ్​సైట్​ జెస్సీ ఫొటోతో ఓ వార్తా కథనం ప్రచురించింది. అది చూసిన అతడు ఆ సంస్థకు "నేను అల్బెర్టాలోని ఎడ్మాంటన్​లో ఉన్నాను. నేను తిరిగి రాను." అని ఫేస్​బుక్​లో మెస్సేజ్​ పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు ఎడ్మాంటన్​కు వెళ్లి పని ముగించారు.

"జెస్సీ మెసేజ్​ పెట్టి మాకు సాయం చేయటం సంతోషంగా ఉంది. అతనిపై అల్బెర్టాలో వారెంట్​ జారీ చేసి బ్రిటిష్ కొలంబియాకు తీసుకొచ్చే ఏర్పాట్లు చేసుకున్నాం."
-జోడీ షెల్కీ, ఫెడరల్ పోలీస్ అధికారి

ఇదీ చూడండి: ఫేస్​బుక్​ లైవ్​ ఇస్తున్నారా? అయితే జాగ్రత్త..!

ABOUT THE AUTHOR

...view details