అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఆరిజోనాలోని వెస్ట్ ఫోనిక్స్ ప్రాంతంలో ఓ దుండగుడు జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోగా.. 12 మంది గాయపడ్డారు. 90 నిమిషాల వ్యవధిలో దుండగుడు మూడు పట్టణాల్లో.. కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
కాల్పుల ఘటనపై.. పియోరియా, సర్‌ప్రైజ్, గ్లెండెల్ పోలీసులు విభాగాలు ఎఫ్బీఐ, ఆరిజోనా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీతో కలిసి దర్యాప్తు జరుపుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారంతో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఆంక్షలున్నా..
అమెరికాలో ఇటీవల కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. క్లబ్బులు, మాల్స్ వంటి ప్రదేశాల్లో దుండగులు ఇష్టానుసారంగా కాల్పులకు తెగబడుతున్నారు. ఈ నేపథ్యంలో తుపాకీ వినియోగాన్ని కట్టడి చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఏప్రిల్ నెలలో కీలక ప్రకటన చేశారు. సీరియల్ నంబర్లు లేనివి, నాటు తుపాకుల వినియోగాన్ని కట్టడి చేసేలా వాటిపై ఆంక్షలు విధిస్తున్నట్టుస్పష్టం చేశారు. అయినప్పటికీ.. అమెరికాలో కాల్పుల ఘటనలు జరుగుతూనే ఉండటం గమనార్హం.
ఇదీ చూడండి:అమెరికాలో పేలిన తుపాకీ.. ఒకరు మృతి
ఇదీ చూడండి:చికాగోలో దారుణం- మూడేళ్ల బాలుడి తలపై కాల్పులు