భారత్ 74వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అమెరికాలోని సిలికానాంధ్ర తెలుగు సంఘం వారి ఆధ్వర్యంలో శనివారం జూమ్ వేదికగా.. లక్ష గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం ఆలపించారు. ఈ కార్యక్రమానికి సుమారు 50 దేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. చిన్నా, పెద్దా తేడాలేకుండా అందరూ గొంతు కలిపి ఈ అద్భుత కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఇంతమంది ఒకేసారి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం గొప్ప విశేషమే కాకుండా సాంకేతికంగానూ మహత్కార్యమని నిర్వాహకులు తెలిపారు.
'హనుమంతుని శక్తి ప్రజలకు కావాలి'
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రజలందరికీ మనో బలంతో పాటు సామాజిక స్థైర్యం, శాంతి నెలకొనాలని వారి ఆశించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్.. త్వరలోనే ఈ ప్రపంచం కరోనా నుంచి బయట పడాలని ఆకాంక్షించారు. హనుమంతుడికి బుద్ధి, బలం, పరాక్రమం కలగలసిన శక్తి ఉందని, అది ప్రజలందరికీ కావాలని ఆయన కోరారు.
కరోనాను జయించాలని..