అమెరికా కాలిపోర్నియాలోని యూదుల ప్రార్థనా స్థలంలో ఆగంతుకుడి కాల్పులు కలకలం సృష్టించాయి.దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి ఫర్వాలేదని వైద్యులు తెలిపారు. పోలీసులు అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఈ దాడిని ద్వేషపూరిత చర్యగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్జ్ ట్రంప్ తెలిపారు. క్షతగాత్రులకు సంఘీభావం తెలుపుతూ ట్వీట్ చేశారు.