తెలంగాణ

telangana

ఏటా 100 కోట్ల మంది చిన్నారులపై హింస

By

Published : Jun 19, 2020, 5:38 PM IST

సరైన రక్షణ చర్యలు లేక ఏటా సుమారు వందకోట్ల మంది చిన్నారులు హింసకు గురవుతున్నారని ఐరాస ఓ నివేదికలో తెలిపింది. బాలలకు భద్రత కల్పించడంలో ఆయా దేశాలు విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

One billion children experience violence every year as countries fail to protect them: UN report
ఏటా వందకోట్ల మంది చిన్నారుల్ని హింసిస్తున్నారట!

ప్రపంచవ్యాప్తంగా ఏటా వందకోట్ల మంది చిన్నారులు శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసకు గురవుతున్నారని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో తెలిపింది. చిన్నారులు వీటి బారినపడకుండా రక్షణ కల్పించడంలో ఆయా దేశాలు విఫలమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ వంటి ఆంక్షల కారణంగా హింస మరింత ఎక్కువైనట్లు చెబుతున్నారు నిపుణులు. చిన్నారుల్లో అత్యధికులు... హింసకు పాల్పడే వారితో ఎక్కువ సమయం గడపాల్సి రావడమే ఇందుకు కారణమని వివరించారు.

చట్టాలు అమల్లో ఉన్నా..

బాలల రక్షణకు అంతర్జాతీయంగా 88 శాతం దేశాల్లో చట్టాలున్నప్పటికీ.. వీటిల్లో సగానికంటే తక్కువగా 47 శాతం దేశాలు మాత్రమే కఠినంగా అమలు చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. పిల్లలకు రక్షణ కల్పించడంలో మిగతా దేశాలు పూర్తిగా విఫలమవుతున్నాయని... ఫలితంగా ఏటా వందకోట్ల మంది చిన్నారులపై ఈ ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:రోజూ వ్యాయామం చేయండి.. ఆయుష్షు పెంచుకోండి

ABOUT THE AUTHOR

...view details