అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్థానిక మీడియాతో మంగళవారం జరిగిన ఇంటర్య్వూ సందర్భంగా జాతివివక్షకు సంబంధించి తన అనుభవాలను పంచుకున్నారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడు స్నేహితుడు తనపై జాతివిద్వేష వ్యాఖ్యలు చేసినందుకు అతని ముక్కు విరగ్గొట్టి బుద్ధి చెప్పానన్నారు.
"అతనూ నేను కలిసి బాస్కెట్బాల్ ఆడేవాళ్లం. ఓ రోజు లాకర్ రూమ్లో మా మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో అతను నన్ను కించ పరిచేలా జాతివిద్వేష వ్యాఖ్యలు చేశాడు. బుద్ధి చెప్పేందుకు మొహం మీద దాడి చేసేసరికి అతని ముక్కు విరిగింది. ఇంకెప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించాను."