అఫ్గాన్ నుంచి బయటకు వచ్చే ముందు కాబుల్‌లో రెండుసార్లు డ్రోన్ దాడులు (US drone strike) నిర్వహించింది అమెరికా. ఈ దాడుల్లో ఉగ్రవాదులను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. అయితే ఆగస్టు 29న జరిపిన దాడుల్లో ఏడుగురు చిన్నారులు సహా 10మంది అఫ్గాన్ పౌరులు మరణించారని దర్యాప్తులో తేలింది. చివరకు ప్రజలకు అమెరికా క్షమాపణలు చెప్పుకుంది(us military drone strike). అయితే ఈ వ్యవహారాన్ని అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. దర్యాప్తుపై ఉన్నతస్థాయి సమీక్షకు ఆదేశించారు అగ్రరాజ్య రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్.
బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలా? వద్దా? అని ఈ సమీక్షలో నిర్ణయిస్తారు. ఘటనకు గల కారణాలపై జరిగిన సెంట్రల్ కమాండ్ ఇన్వెస్టిగేషన్‌పై సమీక్షకు ఉన్నతాధికారిని నియమించాలని అగ్రరాజ్య వాయుసేనకు ఆదేశాలిచ్చారు ఆస్టిన్.
ఇదీ చూడండి:-US drone strike: అమెరికా చివరి దాడి గురి తప్పిందిలా!
గత నెలలో.. అమెరికా సైన్యం వెనుదిరగకముందే మెరుపువేగంతో అఫ్గాన్‌ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు. దేశంలో సంక్షోభంలోకి జారుకుంది. ప్రజలు దేశాన్ని వీడేందుకు కాబుల్ విమానాశ్రయానికి(us kabul news) పరుగులు తీశారు. రద్దీ ప్రాంతాలే లక్ష్యంగా ఐసిస్-కే ఉగ్రదాడులకు తెగబడింది. కొన్ని రోజుల తర్వాత.. ఐసిస్-కే కీలక స్థావరాల్లో ప్రతీకార దాడులు చేసింది అమెరికా. అనంతరం అదే కాబుల్ విమానాశ్రయం వద్ద రాకెట్ దాడులు చేసింది. ఉగ్రకుట్ర భగ్నం చేసినట్టు.. ఉగ్రవాదిని మట్టుబెట్టినట్టు ప్రకటించింది. కానీ ఆ దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.