తెలంగాణ

telangana

ETV Bharat / international

US Travel Rules: బైడెన్​ స్ట్రిక్ట్ రూల్స్- అమెరికా ప్రయాణం కాస్త కష్టమే! - ఒమిక్రాన్​ వైరస్​

US Travel Rules: ఒమిక్రాన్​ సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలు మళ్లీ ఆంక్షలు కట్టుదిట్టం చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కొవిడ్​ కట్టడికి కాస్త కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. ప్రయాణ ఆంక్షల వల్ల విదేశాల నుంచి అమెరికన్లకు కూడా ఇబ్బందులు ఎదురుకానున్నాయి.

What are the rules for travellers entering the US?
అమెరికా ప్రయాణం ఆంక్షల మయం

By

Published : Dec 4, 2021, 4:30 PM IST

Omicron Scare in America: కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.​ తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ రకం.. డిసెంబర్​ 1న అమెరికాలోకి ప్రవేశించింది. కాలిఫోర్నియాలో ఒక ఒమిక్రాన్​ కేసు నమోదైంది.

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో వైరస్​ కట్టడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కఠిన నిర్ణయాలే తీసుకుంటున్నారు. శీతాకాలంలో.. ఇంట్లో ఉన్నవారిలోనూ వైరస్​ వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్న నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు రూపొందించారు. విదేశాల నుంచి తిరిగొచ్చే అమెరికన్లకు వీటి వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు. వచ్చే వారంలో ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. వీటి ప్రకారం..

  • అమెరికా బయల్దేరడానికి ఒక్కరోజు ముందు చేయించుకున్న కొవిడ్‌ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఇది 3 రోజుల వరకు చెల్లుబాటు అయ్యేది. ఇందులో నెగెటివ్‌ వచ్చినట్టు ప్రయాణికులు ధ్రువపత్రం/ఆధారాలను చూపించాలి.
  • జాతి, వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా అమెరికన్లు సహా ప్రయాణికులందరికీ ఇది వర్తిస్తుంది.
  • విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. జనవరితో ముగిసే ఈ నిబంధన గడువును పొడిగిస్తారు.
  • ప్రజారవాణా, పబ్లిక్‌ స్థలాల్లో మాస్కు ధరించని వారికి రూ.37 వేల నుంచి రూ.2.25 లక్షల (500-3,000 డాలర్ల) వరకు జరిమానా విధిస్తారు.
  • విదేశాల నుంచి అమెరికా చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. నెగెటివ్‌ వచ్చినా కొద్దిరోజులు క్వారంటైన్‌లో ఉండాలి.
  • ప్రయాణికులు వారి కాంటాక్ట్​ ట్రేసింగ్​ సమాచారాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో వ్యక్తుల పేర్లు, చిరునామా, ఫోన్​ నెంబర్లు, మెయిల్​, పుట్టిన తేదీ వంటి వివరాలు ఉండాలి.
  • దక్షిణాఫ్రికా సహా ఏడు ఆఫ్రికా దేశాల ప్రయాణికులపై ఇప్పటికే నిషేధం విధించింది అమెరికా ప్రభుత్వం.
  • అమెరికా పౌరులు, శాశ్వత నివాసితులకు ఇందులో మినహాయింపు ఉంటుంది.
  • ఒమిక్రాన్​ వేరియంట్​పై శాస్త్రవేత్తలు ఇంకా అధ్యయనం చేస్తున్నందున.. కఠిన నిబంధనలు అదనపు రక్షణ కల్పిస్తాయని చెప్పారు బైడెన్​.

Joe Biden On Omicron:

కొత్తగా పుట్టుకొచ్చిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్​ను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని బైడెన్ ప్రకటించారు. ఈ మేరకు మహమ్మారిపై ఎలా పోరాడాలో వివరిస్తూ.. ప్రత్యేక వ్యూహాన్ని తయారుచేయనున్నట్లు తెలిపారు. ఈ వేరియంట్​ను చూసి భయం, కంగారు పడొద్దని ప్రజలకు సూచించారు.

ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఇవీ చూడండి:తొలుత ఎలుకల్లో ఒమిక్రాన్‌.. ఆ తర్వాతే మనుషులకు!

Omicron Variant : ఒమిక్రాన్​పై ప్రస్తుతమున్న టీకాలు పనిచేస్తాయా?

ABOUT THE AUTHOR

...view details