తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా వైరస్​ను తరిమికొట్టే ఆయింట్​మెంట్​! - కరోనా వ్యాక్సిన్​

కరోనా మహమ్మారిని నియంత్రించే ఔషధం కోసం..ప్రపంచమంతా ఎదురుచూస్తున్న వేళ అమెరికాకు చెందిన..ఒక ఫార్మా సంస్థ సంచలన ప్రకటన చేసింది. కొవిడ్‌ను కట్టడిచేసే ఆయింట్‌మెంట్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఈ ఆయింట్‌మెంట్‌కు 'అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్' (యూఎస్​ఎఫ్​డీఏ) ఆమోదముద్ర వేసినట్లు పేర్కొంది. వైద్యుల సిఫార్సు అవసరం లేకుండానే ఈ ఆయింట్‌మెంట్‌ను వాడుకోవచ్చని ప్రకటించింది.

ointment found to treat kill coronavirus got usfda approve
కరోనాను తగ్గిస్తున్న ఆయింట్‌మెంట్‌?

By

Published : Aug 22, 2020, 12:43 PM IST

Updated : Aug 22, 2020, 4:39 PM IST

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని పొట్టనబెట్టుకుంటున్న కరోనా సహా అనేక వైరస్‌లను సంహరించే తమ ఆయింట్‌మెంట్‌కు 'అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్'‌ (యూఎస్​ఎఫ్​డీఏ) ఆమోదం లభించిందని అమెరికాకు చెందిన 'అడ్వాన్స్​డ్‌ పినిట్రేషన్‌ టెక్నాలజీ' (ఏపీటీ) ఫార్మా కంపెనీ తెలిపింది. ఏపీటీ టీ3ఎక్స్‌ పేరుతో రూపొందించిన ఈ ఆయింట్‌మెంట్‌ను వైద్యుడు సిఫారసు చేసిన మందుల చిట్టీ అవసరం లేకుండా ఎవరైనా వాడుకోవచ్చని పేర్కొంది. ఏపీటీ టీ3ఎక్స్‌ ఆయింట్‌మెంట్‌తో చికిత్స చేసిన 30 సెకన్ల తర్వాత ఎలాంటి వైరస్‌ కనిపించలేదని ల్యాబ్‌ నివేదికల్లో వెల్లడైనట్లు పరిశోధకులు తెలిపారు. దీనిని ఆరోగ్య సిబ్బంది సాయం అవసరం లేకుండానే సులభంగా వాడవచ్చని పేర్కొన్నారు.

రక్షణగా...

ముక్కు ద్వారా సంక్రమించే కరోనా వైరస్‌ నుంచి తప్పించుకునేందుకు ఏపీటీ టీ3ఎక్స్‌ కచ్చితంగా ఉపయోగపడుతుందని అడ్వాన్సుడ్‌ పినిట్రేషన్‌ టెక్నాలజీ-ఏపీటీ.. సీఈఓ డాక్టర్ బ్రియన్ హుబెర్‌ తెలిపారు. ఈ ఆయింట్‌మెంట్‌ ఒక గొప్ప ఆవిష్కరణ అని,ఇలాంటి రక్షణ కోసమే చాలా మంది ఎదురుచూస్తున్నారని బ్రియన్‌ చెప్పారు. కొవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ఇది ముందు వరుసలో నిలుస్తుందని ఒక శక్తిమంతమైన రక్షణ పొరగా ఉపయోగపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఉత్పత్తిని 8 ఏళ్ల కింద తయారు చేసినప్పటికీ ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు ప్రభావవంతమైన మూలకాలను జోడించినట్లు పేర్కొంది.

సెకన్ల వ్యవధిలోనే...

లండన్‌లోని వైరాలజీ రీసెర్చెస్‌ సర్వీసెస్‌ లిమిటెడ్..‌ ప్రయోగశాలలో ఏపీటీ టీ3ఎక్స్‌లోని యాంటీ వైరల్ గుణాలను పరిశీలించింది. కరోనా వైరస్‌తో పాటు ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌లపై ఆయింట్‌మెంట్‌ ప్రభావవంతంగా పనిచేస్తుందని ఆ సంస్థ నివేదించింది. సెకన్ల వ్యవధిలోనే వైరస్‌ రోగకారకతను నిర్వీర్యం చేస్తోందని తెలిపింది. ఆయింట్‌మెంట్‌ను ముక్కులోకి పీల్చుకోవడం ద్వారా వైరస్‌ సంక్రమణను దాదాపు అడ్డుకోవచ్చని పేర్కొంది. ప్రయోగశాలలో నిర్దేశిత వాతావరణంలో 99% వైరల్‌ లోడ్‌ తగ్గిందని వెల్లడించింది. బ్యాక్టీరియా,ఫంగస్‌ల నుంచి రక్షణకు సైతం ఏపీటీ టీ3ఎక్స్‌ ఆయింట్‌మెంట్‌ను ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఏపీటీ టీ3ఎక్స్‌ వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని సదరు ఫార్మా సంస్థ తెలిపింది.

Last Updated : Aug 22, 2020, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details