అమెరికాలోని పశ్చిమ వర్జీనియాలో మంచు విపరీతంగా కురుస్తోంది. కనావ్హా, రాలే కౌంటీల్లోని రోడ్లను దట్టమైన మంచు కమ్మేసింది. కొన్నిచోట్ల రహదారులపై వాహనాలు కదల్లేని పరిస్థితి. దీంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనపడక ఢీకొంటున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి హిమపాతం వల్ల వాహనాలు రోడ్లపై జారుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వీలైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని వాహనదారులను పశ్చిమ వర్జీనియా అధికార వర్గాలు కోరాయి.
మంచు ఎఫెక్ట్: 'వాహనదారులూ.. రోడ్లపైకి రాకండి' - stay off snow-slickened roads if possible
పశ్చిమ వర్జీనియాలో ఎడతెరపి లేకుండా మంచు కురుస్తోంది. మంచు దట్టంగా పడుతుండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనపడక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాహనదారులు వీలైనంత వరకు రోడ్లపైకి వచ్చే పనులను విరమించుకోవాలని సూచించింది వాతావరణ శాఖ.
![మంచు ఎఫెక్ట్: 'వాహనదారులూ.. రోడ్లపైకి రాకండి' Officials in West Virginia were warning drivers on Tuesday morning to stay off snow-slickened roads if possible](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5632865-143-5632865-1578459211583.jpg)
మంచు ఎఫెక్ట్: 'వాహనదారులూ.. రోడ్లపైకి రాకండి..'
మంచు ఎఫెక్ట్: 'వాహనదారులూ.. రోడ్లపైకి రాకండి..'
ప్రమాదం బారిన 100 వాహనాలు
రోడ్లపై అంగుళం నుంచి నాలుగు అంగుళాల మేర మంచు పేరుకుపోయింది. ఇప్పటివరకు వందకు పైగా ప్రమాదాలు జరిగాయి. కేవలం 20 నిమిషాల వ్యవధిలో 20 వాహనాలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. వాహనదారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జాతీయ వాతావరణ విభాగం డబ్ల్యూసీహెఎస్ పలు సూచనలు జారీ చేసింది.