అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వీయ అనుభవాలతో రాసిన 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' పుస్తకం రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. ఈ పుస్తకం మొదటి భాగం మంగళవారం విడుదల కాగా ఒక రోజు వ్యవధిలోనే దాదాపు 8లక్షల 90 వేల కాపీలు అమెరికా, కెనాడాలో అమ్ముడయ్యాయి. ఇప్పటివరకు అమెరికా అధ్యక్షులు రాసిన పుస్తకాల్లో అత్యధికంగా కొనుగోలు అవుతున్న పుస్తకంగా ఏ ప్రామిస్డ్ ల్యాండ్ రికార్డు సృష్టిస్తోంది.
ఒబామా పుస్తకానికి రికార్డ్ స్థాయి కొనుగోళ్లు - బరాక్ ఒబామా
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాసిన పుస్తకం 'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది. ఒక్క రోజు వ్యవధిలోనే దాదాపు 9 లక్షల కాపీలు కొనుగోలయ్యాయి. అమెరికా అధ్యక్షులు రాసిన పుస్తకాల్లో అత్యధికంగా కొనుగోలు అవుతూ రికార్డు సృష్టిస్తోంది.
'ఏ ప్రామిస్డ్ ల్యాండ్' రికార్డు స్థాయి విక్రయాలు
ఒబామా రాజకీయ జీవిత అనుభవాలను పొందుపరిచిన ఈ పుస్తకంలో ప్రపంచదేశాల అధినేతలతో పాటు భారతదేశ సందర్శనకు వచ్చినప్పటి అనుభవాలను వివరించారు. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పట్ల ఆయనకు కలిగిన భావాలను పుస్తకంలో పొందుపరిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వం గురించి కూడా పుస్తకంలో వివరించారు.
ఇదీ చూడండి: ఆధునిక కాలంలో భారత్‌ది విజయగాథ: ఒబామా