తెలంగాణ

telangana

ETV Bharat / international

రెండేళ్లలో ట్రంప్ పన్ను చెల్లింపులు 750 డాలర్లు మాత్రమే!

పదేళ్లపాటు ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించి తనపై వచ్చిన మీడియా కథనాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ వార్తలన్నీ అవాస్తవమని, ఉద్దేశపూర్వకంగా సృష్టించినవేనని స్పష్టం చేశారు. రెండేళ్లలో 750 డాలర్లు మాత్రమే ట్రంప్ చెల్లించారని ఓ ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది.

By

Published : Sep 28, 2020, 9:43 AM IST

Trump Tax
డొనాల్డ్ ట్రంప్

పన్ను ఎగవేసినట్లు తనపై వచ్చిన ఆరోపణలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ఇవి పూర్తిగా తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. ఇవి ఉద్దేశపూర్వకంగా సృష్టించిన కథనాలని ఓ మీడియా ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.

"ఇది పూర్తిగా నకిలీ వార్త. నిజానికి నేను పన్నులు కట్టాను. నా పన్ను రిటర్నులు ప్రస్తుతం ఆడిట్​లో ఉన్నాయి. అవి పూర్తి కాగానే మీకే నిజాలు తెలుస్తాయి. న్యూయార్క్ టైమ్స్ కొన్ని కల్పితాలను సృష్టించాలని భావిస్తోంది. వాళ్లు చేయాలనుకున్నది చేస్తున్నారు."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

10 ఏళ్లు ఎగవేత!

టీవీ కార్యక్రమాలు, ఇతర ఎండార్స్‌మెంట్, లైసెన్సింగ్ ఒప్పందాల ద్వారా 2018 వరకు 427.4 మిలియన్ డాలర్లు అందుకున్నారని ద న్యూయార్క్ టైమ్స్​ పత్రిక నివేదిక వెల్లడించింది. అయితే, గత 15 ఏళ్లలో 10 సంవత్సరాలు ట్రంప్ ఆదాయపు పన్ను కట్టలేదని తెలిపింది.

"పన్ను రిటర్నుల డేటా ప్రకారం.. 2016, 2017 సంవత్సరాల్లో ఆదాయపు పన్నుగా 750 డాలర్లు మాత్రమే చెల్లించారు" అని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.

ఇదీ చూడండి:శత్రు దేశానికి ఉత్తర కొరియా హెచ్చరిక.. కారణం ఇదే!

ABOUT THE AUTHOR

...view details