తెలంగాణ

telangana

ETV Bharat / international

అణు యుద్ధాలను నిరోధించాలని ఐదు అగ్ర దేశాల పిలుపు - international news in telugu

Nuclear war: అణు యుద్ధాలు వద్దని అణ్వాయుధ దేశాలైన అమెరికా, రష్యా, బ్రిటన్​, చైనా, ఫ్రాన్స్ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చాయి. అణు యుద్ధంలో గెలవలేమని, అది ఎప్పటికీ రాకూడదని పేర్కొన్నాయి. అణ్వస్త్రాలు కేవలం రక్షణ ప్రయోజనాలను అందించాలని, దూకుడు స్వభావానికి కళ్లెం వేయడానికి మాత్రమే వాటిని వినియోగించాలని తెలిపాయి.

Nuclear war, అణు యుద్ధాలు
అణు యుద్ధాలు నివారించాలి

By

Published : Jan 4, 2022, 8:45 AM IST

Nuclear war: అణు యుద్ధాలను నిరోధించాలని, అణ్వస్త్రాలను ఏ దేశంపైనా మోహరించకూడదని, పోటాపోటీగా ఆయుధాలను సమకూర్చుకోవడానికి స్వస్తి పలకాలని అణ్వస్త్ర దేశాలైన అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ సంయుక్త ప్రకటనలో పిలుపునిచ్చాయి. అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నివారించడం, వ్యూహాత్మక ప్రమాదాలను తగ్గించడం తమ ప్రథమ కర్తవ్యాలని ఉద్ఘాటించాయి. అణు యుద్ధంలో గెలవలేమని, అది ఎప్పటికీ రాకూడదని పేర్కొన్నాయి. అణ్వస్త్రాలు కేవలం రక్షణ ప్రయోజనాలను అందించాలని, దూకుడు స్వభావానికి కళ్లెం వేయడానికి, యుద్ధాన్ని నివారించడానికి మాత్రమే వాటిని వినియోగించాలని పిలుపునిచ్చాయి.

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలైన ఈ ఐదు దేశాలు ఈ మేరకు తొలిసారిగా సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ఇదీ చదవండి:Kim slim: దేశం కోసం తక్కువ తిని స్లిమ్​గా మారిన కిమ్!

ABOUT THE AUTHOR

...view details