తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాతో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్​ వైఖరేంటి? - ట్రంప్​ కరోనా వైరస్​

చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై ఇప్పుడు తన ఆలోచనలు భిన్నంగా ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ అన్నారు. కరోనా వైరస్​ విజృంభణ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

Now, feel 'differently' about trade deal with China: Trump
చైనాతో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్​ మనసు మారుతోందా!

By

Published : May 20, 2020, 10:05 AM IST

అమెరికా-చైనా మధ్య సంబంధాలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. ఈ ప్రభావం ఇరు దేశాల వాణిజ్యంపైనా పడే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కరోనా వైరస్​ విషయంలో చైనాపై అమెరికా అధ్యక్షుడు ప్రత్యక్షంగానే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా.. జనవరి నెలలో చైనాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందంపై తన ఆలోచనలు భిన్నంగా ఉనట్టు ట్రంప్​ తెలిపారు.

"మూడు నెలల క్రితం ఒకలా ఆలోచించాను (వాణిజ్య ఒప్పందంపై). ఇప్పుడు నా ఆలోచనలు మారాయి. ఏం జరుగుతుందో చుద్దాం. కానీ ఈ పరిస్థితుల చాలా నిరాశను కలిగిస్తున్నాయి. చైనాలో జరిగిన సంఘటనలు నిరాశాజనకంగా ఉన్నాయి. మహమ్మారిని అడ్డుకోవాల్సింది. అసలు అది జరిగుండాల్సింది కాదు."

--- డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

22 నెలల పాటు సాగిన వాణిజ్య యుద్ధానికి స్వస్తి పలుకుతూ.. ఈ ఏడాది జనవరిలో అమెరికా-చైనా తొలి దశ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందం ప్రకారం 2020-21లో అమెరికా నుంచి చైనా 200 బిలియన్​ డాలర్ల కొనుగోళ్లు చెయ్యాలి. ఇది చారిత్రక ఒప్పందమని ఆ సమయంలో ట్రంప్​ ఉద్ఘాటించారు. కానీ ఇప్పుడు భిన్నంగా ఆలోచిస్తున్నట్టు పేర్కొన్నారు.

అయితే.. 'చైనాపై చర్యలు తీసుకుంటారా?' అని అడిగిన ప్రశ్నకు మాత్రం ట్రంప్​ సమాధానమివ్వలేదు.

మరోవైపు కరోనా అంశంలో చైనాపై అమెరికా దాడి కొనసాగుతోంది. తాజాగా అగ్రరాజ్యంలోని ప్రముఖ సెనేటర్​ మార్తా మెక్​సాలీ చైనాపై తీవ్ర విమర్శలు చేశారు. వైరస్​ను అమెరికాపై చైనా వదిలిందని మండిపడ్డారు. వైరస్​కు సంబంధించిన ఆధాారాలను చైనా ధ్వంసం చేసిందని, జర్నలిస్టులను దేశం నుంచి వెళ్లగొట్టిందని ఆరోపించారు.

ఇదీ చూడండి:-జ్వరం, దగ్గు లేకపోయినా కరోనా ఉండొచ్చు!

ABOUT THE AUTHOR

...view details