ప్రత్యేక రకమైన ప్రోటీన్లను ఉత్పత్తి చేసే వ్యాక్సిన్.. కరోనా వైరస్‌పై సమర్థంగా పనిచేస్తోందని ఓ అధ్యయనం వెల్లడించింది. ఎలుకలపై జరిపిన ప్రయోగాల ఆధారంగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
అమెరికాలోని ఒహాయో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధనను చేపట్టారు. కణాల్లోకి చేరేందుకు వైరస్ వినియోగించే రెండు ప్రోటీన్లకు.. సహజసిద్ధమైన ప్రక్రియతో మార్పులు చేసి వాటి స్థాయిలను పెంచారు. అనంతరం వాటిని నానోపార్టికల్స్లోకి ప్యాక్ చేసి.. ఎలుకలకు ఇచ్చారు.
నెల రోజుల తర్వాత.. ఆ ఎలుకల్లో యాంటీబాడీలు అభివృద్ధి అయ్యాయి. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్న టీకాలకు ఈ వ్యాక్సిన్ ప్రత్యామ్నాయమని ఒహాయో విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ యిజౌ డాంగ్ చెప్పారు.