తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనా​.. ఇక సాధారణ జలుబు కారకమే! - జర్నల్​ సైన్స్ ప్రచురణలు

అనతికాలంలోనే ప్రపంచదేశాల్లో వ్యాప్తి చెందిన కరోనా వైరస్​ ఎండెమిక్​గా మారనుందని ఓ అధ్యయనంలో తేలింది. రానున్న రోజుల్లో ఇది సాధారణ జలుబు కారక వైరస్​గా మారనుందని, మనుషుల్లో పిన్న వయసు నుంచే దీని వ్యాప్తి మొదలవుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

sars cov-2
కరోనా వైరస్​.. సాధారణ జలుబు కారకంగా మారనుందా?

By

Published : Jan 13, 2021, 4:16 PM IST

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా వైరస్ రానున్న రోజుల్లో​ స్థానిక వ్యాధి(ఎండెమిక్​) కానుందని ఓ తాజా అధ్యయనంలో తేలింది. కొవిడ్-19 కారక​ సార్స్​ కోవ్-2 వైరస్ ఎండెమిక్​గా మారితే అది సాధారణ జలుబుకు దారి తీస్తుందని, చిన్నతనంలోనే వైరస్​ సోకనుందని అధ్యయనంలో వెల్లడైంది. సార్స్​ కోవ్-1, నాలుగు జలుబు కారక కరోనా వైరస్​లపై చేసిన ఈ అధ్యయనాన్ని సైన్స్​ జర్నల్ మంగళవారం ప్రచురించింది.

"చిన్నతనంలోనే వ్యాధి సంక్రమిస్తే పెరిగే కొద్దీ వారికి వైరస్​ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ పెరుగుతూ వస్తుంది. కానీ, స్థానిక వ్యాధి నుంచి వారు పూర్తిగా బయటపడడం కష్టం" అని ఈ అధ్యయనంలో ప్రధాన పాత్ర పోషించిన అమెరికా ఎమోరీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త జెన్నీ లావైన్​ వివరించారు.

అధ్యయనంలో తెలిసిన మరిన్ని విషయాలు....

3-5 మధ్య వయసు గల చిన్నారుల్లోనే సార్స్​ కోవ్​-2 ఎండెమిక్ తొలుత సంక్రమించనుందని శాస్త్రవేత్తలు తెలిపారు. వయసుపైబడిన వారికి వైరస్​ సోకినా అది ప్రమాదకారి కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు. స్థానిక వ్యాధి వ్యాప్తి వ్యవధి ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్​లు పెంచే ఇమ్యూనిటీపై ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు.

సీజనల్​ వ్యాధులకన్నా సార్స్​ కోవ్-2 వల్ల మరణించే వారి సంఖ్య తక్కువగా ఉంటుందని అధ్యయనంలో తెలిసింది. వైరస్​ ఎండమిక్​గా మారిన అనంతరం పెద్ద మొత్తంలో వ్యాక్సినేషన్​ ప్రక్రియను చేపట్టాల్సిన పనిలేదని తేలింది.

ఇదీ చదవండి:గొడ్డలితో పార్లమెంట్​ తలుపులు బద్దలు కొట్టి..

ABOUT THE AUTHOR

...view details