తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఇవి.. కరోనాను అడ్డుకునే సరికొత్త యాంటీబాడీలు' - యాంటీబాడీలపై పరిశోధన

కరోనా తీవ్రతను గణనీయంగా తగ్గించే సరికొత్త యాంటీబాడీలను(Corona Antibody) అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి వివిధ కరోనా వైరస్‌ల కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా అడ్డుకుంటాయని నిర్ధరించారు.

antibody
యాంటీబాడీలు

By

Published : Nov 4, 2021, 5:19 AM IST

వివిధ కరోనా వైరస్‌ల కారణంగా తలెత్తే ఇన్‌ఫెక్షన్లను సమర్థంగా అడ్డుకునే సరికొత్త యాంటీబాడీలను(Corona Antibody) శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్‌, కొవిడ్‌-19 తీవ్రతను ఇవి గణనీయంగా తగ్గిస్తాయని నిర్ధరించారు. అమెరికాలోని 'డ్యూక్‌ యూనివర్సిటీ హ్యూమన్‌ వ్యాక్సిన్‌ ఇన్‌స్టిట్యూట్‌' చేపట్టిన ఈ పరిశోధన వివరాలను సైన్స్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌ పత్రిక అందించింది. వైరస్‌లకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ ఉత్పత్తిచేసే సుమారు 1,700 రకాల యాంటీబాడీలను(Corona Antibody) శాస్త్రవేత్తలు సేకరించారు. ఇవన్నీ వైరస్‌ల ఉపరితలంపై ఉండే నిర్దిష్ట భాగాలను చేజిక్కించుకుని, తర్వాత వాటి పనిపడతాయి.

అయితే, వైరస్‌లు మార్పు చెందినప్పుడు కొన్ని యాంటీబాడీలు(Corona Antibody) వాటిని గుర్తించలేవు. ఉపరితల భాగాల ఆకృతి మారడం వల్ల వాటిని పట్టుకోలేవు. సరిగ్గా ఇదే అంశంపై బార్టన్​ హేన్స్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దృష్టి సారించింది. వైరస్‌ ఉపరితలంపై మార్పు చెందని భాగాలనూ, వాటిని లక్ష్యంగా చేసుకునే 50 రకాల యాంటీబాడీలనూ గుర్తించింది. ఇవి సార్స్‌-కొవ్‌-1(సార్స్‌), సార్స్‌-కొవ్‌-2(కొవిడ్‌-19) తీవ్రతను సమర్థంగా అడ్డుకుంటాయని నిర్ధరించింది. భవిష్యత్తులో సార్స్‌-కొవ్‌-3, 4 వైరస్‌లు మనిషికి సోకినా, వాటి నుంచి కూడా ఈ ప్రతినిరోధకాలు రక్షణ కల్పిస్తాయని శాస్త్రవేత్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details