బ్రిటన్ను వణికిస్తున్న కరోనా కొత్త స్ట్రేయిన్పై అమెరికాకు చెందిన నోవావాక్స్ టీకా 89 శాతం ప్రభావం చూపుతోందని టీకా అభివృద్ధి చేసిన నోవావాక్స్ సంస్థ గురువారం ప్రకటించింది. సాధారణ కరోనాపై 96 శాతం ప్రభావితం చేస్తుందని తెలిపింది. కొత్త స్ట్రేయిన్పైన కొవిడ్ టీకాలు ప్రభావం చూపడంపై సందేహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో నోవావాక్స్ ప్రకటన ప్రపంచానికి ఊరట కలిగించే విషయం.
15వేల మందిపై పరిశోధన
నోవావాక్స్ ప్రస్తుతం బ్రిటన్‌లో 15వేల మందిపై పరీక్షలు జరుపుతోంది. ఈ క్రమంలో క్లీనికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వారిలో కొత్త రకం కరోనా సోకినవారు సగానికిపైనే ఉన్నారని తెలిసింది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన మరో రకం కరోనా స్ట్రేయిన్పై కూడా ఈ టీకా పనిచేయగలదని సంస్థ తెలిపింది.