ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ 'కొవాక్స్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్ సంస్థలకు చెందిన 1.1 బిలియన్ల టీకాలను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించనుంది. ఈ మేరకు గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్(గవి)తో నొవావాక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. నొవావాక్స్ టీకాలను అభివృద్ధి చేసి 190 పేద, మధ్య ఆదాయ దేశాలకు రవాణా చేసేందుకు సీరంతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది.
సీరం నుంచి 'కొవాక్స్'కు 1.1 బిలియన్ల టీకాలు! - గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్
ప్రపంచ వ్యాప్తంగా పేద, మధ్య ఆదాయ దేశాలకు 1.1 బిలియన్ల టీకాలను సీరం ఇన్‌స్టిట్యూట్, నోవావాక్స్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ 'కొవాక్స్'కు అందించనున్నాయి. ఈ మేరకు గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్ (గవి)తో నోవావాక్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకాకు చెందిన 240 మిలియన్ల డోసులను 3 డాలర్ల చొప్పున కొనేందుకు కొవాక్స్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. తాము కొవాక్స్ కార్యక్రమానికి 1.1 బిలియన్ల డోసులను అందిచనున్నట్లు సీరం గతంలో ప్రకటించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా 190 పేద, మధ్య ఆదాయ దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్లను అందించనుంది. 336 మిలియన్ల ఫైజర్ బయోఎన్‌టెక్ వ్యాక్సిన్లను కూడా సమీకరించినట్లు యూనిసెఫ్ గతంలో వెల్లడించింది. "ఈ సమయంలో ప్రపంచానికి వీలైనన్ని ఎక్కువ వ్యాక్సిన్లను అందించడమే మా లక్ష్యం" అని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్‌పూనావాలా ఒక ప్రకటనలో తెలిపారు.
ఇదీ చూడండి:'మన టీకాలు కొత్త వైరస్‌పైనా సమర్థంగానే పని చేస్తాయ్'