తెలంగాణ

telangana

ETV Bharat / international

నోవావాక్స్‌ వ్యాక్సిన్​తో ఆశాజనక ఫలితాలు! - VACCINE NEWS

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రూపొందిస్తోన్న వ్యాక్సిన్లు ఆశాజనక ఫలితాలను ఇస్తున్నాయి. అమెరికా బయోటెక్​ కంపెనీ నోవావాక్స్​ తమ కొవిడ్​-19 వ్యాక్సిన్​ భారీ స్థాయిలో ప్రతినిరోధకాలను ఉత్పత్తి చేస్తోందని వెల్లడించింది. కీలకమైన మూడో దశ ట్రయల్స్‌ను భారీ ఎత్తున సెప్టెంబర్‌లో చేపడతామని తెలిపింది.

NOVA VACCINE
నోవావాక్స్‌ వ్యాక్సిన్‌.. ఆశాజనక ఫలితాలు

By

Published : Aug 5, 2020, 5:39 PM IST

ప్రపంచాన్ని కొవిడ్‌ వణికిస్తున్న వేళ.. వ్యాక్సిన్‌పై ప్రయోగాలు ఆశాజనక ఫలితాలను చూపించడం మానవాళికి ఊరట కలిగిస్తోంది. తాజాగా అమెరికా బయోటెక్‌ కంపెనీ నోవావాక్స్‌ తమ కొవిడ్‌ 19 వ్యాక్సిన్‌ బలమైన రోగనిరోధక శక్తి ఇస్తుందని ప్రకటించింది. ప్రస్తుతం కోలుకున్న రోగులలో ఉన్నదానికంటే ఎక్కువ ప్రతినిరోధకాలను ఇది ఉత్పత్తి చేస్తోందని తెలిపింది. వ్యాక్సిన్‌ విజయంపై ఇది ఆశలను పెంచుతోందని పేర్కొంది. ప్రారంభ దశ క్లినికల్‌ ట్రయల్స్‌ డేటాను విశ్లేషించి ఆ కంపెనీ ఈ విషయాన్ని వెల్లడించింది.

కీలకమైన మూడో దశ ట్రయల్స్‌ను భారీ ఎత్తున్న సెప్టెంబర్‌లో చేపడతామని.. వచ్చే ఏడాది బిలియన్‌ నుంచి 2 బిలియన్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఉత్పత్తి చేస్తామని ఆ సంస్థ ప్రకటించింది.

కరోనా వైరస్‌పై పోరులో భాగంగా ప్రభావవంతమైన వ్యాక్సిన్‌ రూపొందించడం కోసం అమెరికా ప్రభుత్వం 1.6 బిలియన్‌ డాలర్లను నొవావాక్స్‌కు ఇచ్చింది. అయితే మోడెర్నా, అస్ట్రాజెనికాలతో పోల్చితే వ్యాక్సిన్‌ రేసులో నోవావాక్స్‌ కాస్త వెనుకబడే ఉంది. ఆ రెండు ఇప్పటికే తుది దశ క్లినికల్‌ ట్రయల్స్‌లోకి ప్రవేశించాయి.

ఇదీ చూడండి: గురువారం నుంచి జైడస్ వ్యాక్సిన్ 2వ దశ ట్రయల్స్

ABOUT THE AUTHOR

...view details