North Korea vs US: ఉత్తరకొరియా.. అమెరికాకు కొరకరాని కొయ్యిగా మారింది. ఓవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నా.. కిమ్ సర్కారు ఏమాత్రం చలించడం లేదు. అణ్వాయుధ సంపత్తిని పెంచుకోవాలనే లక్ష్యంతో అంతర్జాతీయ ఆంక్షలను కాదని.. అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఎప్పటికప్పుడు క్షిపణి ప్రయోగాలు చేస్తోంది కిమ్ సర్కారు. ఇటీవల రెండు దీర్ఘ-శ్రేణి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను(ఐసీబీఎం) ఉత్తర కొరియా ప్రయోగించినట్లు అమెరికా తెలిపింది. భవిష్యత్‌లో మరిన్ని ప్రమాదకరమైన క్షిపణి ప్రయోగాలను కిమ్ సర్కారు చేపట్టే అవకాశముందని హెచ్చరించింది.
తాజాగా ఉత్తరకొరియా జరిపిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం.. 2017లో జరిపిన ఐసీబీఎం(అమెరికాను చేరుకోగల సామర్థ్యం) క్షిపణి పరీక్షల కంటే పెద్దదని.. అంచనా వేసింది అగ్రరాజ్యం. ఈ నేపథ్యంలో ఆ దేశంపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా అధికారులు తెలిపారు. అలాగే పసిఫిక్‌లోని అమెరికన్ క్షిపణి విధ్వంసక, నిఘా దళాలు అప్రమత్తంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఆ కెమెరాను పరీక్షించాం!