తెలంగాణ

telangana

ETV Bharat / international

అధ్యక్ష పోరు: ఆ రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ఆలస్యం - ట్రంప్​ x బైడెన్

అమెరికా అధ్యక్ష పీఠం ఎవరిదో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. కొన్ని రాష్ట్రాల్లో ఈ నెల 12 వరకు పోస్టల్​ బ్యాలెట్లను స్వీకరించేందుకు అధికారులు గడువు ఇచ్చారు. వాటి లెక్కతేలితేనే అధికారిక ప్రకటన వెలువడుతుంది.

North Carolina votes will be counted through till 12 Nov
ట్రంప్

By

Published : Nov 5, 2020, 3:52 AM IST

Updated : Nov 5, 2020, 3:58 AM IST

అమెరికా ఎన్నికల ఫలితాలు మరింత ఆలస్యం అయ్యేలా కనిపిస్తున్నాయి. నార్త్​ కరోలినా రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ఈ నెల 12 వరకు కొనసాగనుంది. పోస్టల్​ బ్యాలెట్లను ఈ నెల 6 నుంచి 12 వరకు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రంలో మొత్తం 15 ఎలక్టోరల్​ ఓట్లు ఉన్నాయి.

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఈ రాష్ట్రంలో ప్రస్తుతం 76 వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇంకా ఫలితాలు తేలని రాష్ట్రాలు...

రాష్ట్రం ఆధిక్యం ఎలక్టోరల్​ ఓట్లు
నెవాడా బైడెన్ 6
పెన్సిల్వేనియా ట్రంప్ 20
నార్త్​ కరోలినా ట్రంప్​ 15
జార్జియా ట్రంప్ 16
అలస్కా ట్రంప్ 3
Last Updated : Nov 5, 2020, 3:58 AM IST

ABOUT THE AUTHOR

...view details