2020 నోబెల్ సాహిత్య పురస్కారం అమెరికాకు చెందిన ప్రముఖ కవయిత్రి లూయిస్ గ్లక్ను వరించింది. వ్యక్తిగత జీవితాలకు తన అత్యద్భుతమైన సాహిత్యంతో గళం ఇచ్చినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది.
అవార్డు గ్రహీతకు బంగారు పతకంతో పాటు 1.1 మిలియన్ డాలర్ల నగదు బహుమతి కూడా లభిస్తుంది.
77ఏళ్ల గ్లక్.. యాలే విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 1968లో విడుదలైన "ఫస్ట్బార్న్" అనే పుస్తకంతో సాహిత్య ప్రపంచానికి పరిచయమయ్యారు. ఆ తర్వాత కొద్ది కాలంలోనే.. అమెరికా సాహిత్య ప్రపంచంలో చెరగని ముద్ర వేశారు. బాల్యం, కుటుంబ జీవితం, తల్లిదండ్రులు-తోబుట్టువుల చుట్టూ ఆమె కవితలు అల్లుకుని ఉంటాయి.