అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చేందుకు సిద్ధమైన స్పేస్ఎక్స్ వ్యోమగాములకు వింత సమస్య ఎదురైంది. వారు తిరుగు ప్రయాణం చేసే క్యాప్సుల్‌లో టాయిలెట్ అందుబాటులో లేదు. కేవలం డైపర్లు ధరించి ప్రయాణాన్ని చేయాల్సి ఉంటుంది. ఆ క్యాప్సుల్‌లో ఉన్న టాయిలెట్ పాడవడమే అందుకు కారణం.
క్యాప్సుల్‌లో టాయిలెట్ లేకపోవడం తమకు పెద్ద సమస్య కాదని నాసా వ్యోమగామి మేగన్ మెక్ ఆర్థర్ తెలిపారు. తమకు వచ్చిన ఇతర సమస్యల్లానే దీనిని కూడా ఎదుర్కొంటామని పేర్కొన్నారు.