INDIA AMERICA RELATION: రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్తో తమ సంబంధాలపై ఎలాంటి ప్రభావం ఉండదని అమెరికా స్పష్టం చేసింది. భారత్తో తమకు సంబంధాలు మెరుగ్గానే ఉన్నాయని, అవి ఆ దేశ యోగ్యతపై ఆధారపడి ఉంటాయని అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ప్రైస్ వ్యాఖ్యానించారు.
ఆ రెండు దేశాల ఉద్రిక్తతల ప్రభావం.. పొరుగు దేశాల భద్రతా వాతావరణంపై ప్రభావం చూపుతుందని గతంలో వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ మేరకు వివరణ ఇచ్చారు.