అమెరికాలో నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల సహా ప్రముఖులు స్పందించారు. సమాజంలో ద్వేషం, జాత్యహంకారానికి చోటు లేదన్న సత్య నాదేళ్ల..ఇతరుల భావాల్ని అర్థం చేసుకొని గౌరవించాలన్నారు. నల్లజాతి, ఆఫ్రికన్ అమెరికన్ల స్వరాన్ని వినిపించేందుకు మైక్రోసాఫ్ట్‌ను వేదికగా నిలుపుతామని ఆ సంస్థ ప్రకటించింది.
నల్లజాతి అమెరికన్ల బాధను వ్యవస్థీకృత జాత్యహంకారాన్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పెప్సీకో మాజీ సీఈఓ ఇంద్రా నూయి వ్యాఖ్యానించారు. న్యాయం కోసం పోరాడుతున్న వారికి మద్దతుగా నిలవాలని ఈ గాయాన్ని ఎలా నయం చేయాలో కూడా ఆలోచించాలని నూయి భావోద్వేగ ట్వీట్ చేశారు.