తెలంగాణ

telangana

ETV Bharat / international

'ట్రంప్​ భారత్​కు మద్దతిస్తారన్న గ్యారెంటీ ఉందా?'​ - భారత్ చైనా సరిహద్దు వివాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్... చైనాకు వ్యతిరేకంగా భారత్​కు కచ్చితంగా మద్దతిస్తారని అనుకోలేమని యూఎస్ జాతీయ భద్రత మాజీ సలహాదారు జాన్ బోల్టన్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నందున ట్రంప్ ఏ విషయాన్ని అయినా పక్కన పెట్టేయగలరని బోల్టన్ అభిప్రాయపడ్డారు.

No guarantee Trump will back India against China if tensions escalate: Former US NSA John Bolton
ట్రంప్​ భారత్​కు మద్దతిస్తారన్న గ్యారెంటీ లేదు: బోల్టన్​

By

Published : Jul 11, 2020, 3:53 PM IST

ఇండియా​-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు మరింత పెరిగితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్... డ్రాగన్​కు వ్యతిరేకంగా భారతదేశానికి మద్దతు ఇస్తారనే గ్యారెంటీ ఏమీ లేదని.. యూఎస్​ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్​ బోల్టన్ అన్నారు.

"మరో నాలుగు నెలల్లోనే అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల ట్రంప్ తన ఎన్నికకు అడ్డంగా ఉన్న (భారత్-చైనా సరిహద్దు వివాదం సహా) ఏ విషయాన్ని అయినా పక్కన పెట్టేయగలరు. అందువల్ల ఒకవేళ భారత్-చైనా సరిహద్దు వివాదం మరింత పెరిగితే.. ట్రంప్ ఇండియాకు కచ్చితంగా మద్దతుగా నిలుస్తారని అనుకోలేం."

- జాన్ బోల్టన్​, అమెరికా జాతీయ భద్రతమాజీసలహాదారు

డొనాల్డ్​​కు ఏమీ తెలియదు

భారత్​-చైనా మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న ఘర్షణ గురించి ట్రంప్​నకు ఏమీ తెలియదని బోల్టన్ పేర్కొన్నారు. 'బహుశా చైనాతో భౌగోళిక వ్యూహాత్మక సంబంధం గురించి ట్రంప్ ఆలోచిస్తున్నారని అనుకుంటున్నా. ముఖ్యంగా వాణిజ్యం విషయంలో'... అని జాన్ బోల్టన్​ పేర్కొన్నారు.

"నవంబర్​ ఎన్నికల తరువాత ట్రంప్ ఏమి చేస్తారో నాకు తెలియదు. బహుశా ఆయన మళ్లీ యూఎస్​-చైనా వాణిజ్య ఒప్పందంపై దృష్టి సారించవచ్చు."

- జాన్ బోల్టన్​

జాన్ బోల్టన్ 2018 ఏప్రిల్ నుంచి 2019 సెప్టెంబర్​ వరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నారు.

చైనా దురాక్రమణవాదం

చైనా విస్తరణవాదంతో హద్దుమీరి ప్రవర్తిస్తోందని జాన్​ బోల్టన్ విమర్శించారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రాలపై, వాటిలోని చిన్న చిన్న ద్వీపాలపై ఆధిపత్యం చెలాయించాలని డ్రాగన్ ప్రయత్నిస్తోందని అన్నారు. ఫలితంగా జపాన్​, భారత్​తో సహా ఇరుగుపొరుగు దేశాలతో డ్రాగన్ ద్వైపాక్షిక సంబంధాలు బాగా క్షీణించాయని బోల్టన్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:తెరవకపోతే.. పన్ను మినహాయింపు ఉండదంతే: ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details