ప్రతిష్టాత్మక స్పెల్లింగ్ బీ పోటీల్లో ఈ సారి 11 మంది విద్యార్థులు ఫైనల్స్‌కు ఎంపికయ్యారు. అయితే.. వీరిలో 9 మంది భారత సంతతికి చెందిన విద్యార్థులే ఉండటం విశేషం.
జులై 8న ఫ్లోరిడాలో 'నేషనల్ స్పెల్లింగ్ బీ ఫైనల్స్' జరగనున్నాయి. ఈ పోటీల్లో పాల్గొన్న మొత్తం 209 మంది విద్యార్థులకు బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్. జే మైఖేల్ డర్నిల్ శుభాకాంక్షలు తెలిపారు.
ఫైనల్స్‌కు చేరింది వీరే..
- రాయ్ సెలిగ్మాన్(12), నసౌ- బహమాస్
- భావన మదిని(13), న్యూయార్క్
- శ్రీతన్ గాజుల(14), ఛార్లోట్, ఉత్తర కరోలినా
- అశ్రిత గంధారి(14), వర్జీనియా
- అవని జోషి(13), ఇలినాయిస్
- జైలా అవంత్- గార్డె(14), లీస్బర్గ్
- వివిన్షా వెదురు(10), టెక్సాస్
- ధ్రువ్ భరతియా(12), డాలస్
- విహాన్ సిబాల్(12), టెక్సాస్
- అక్షిని కమ్మ(13), టెక్సాస్
- చైత్ర తుమ్మల(12), శాన్ఫ్రాన్సిస్కో
కరోనా కారణంగా 2020లో స్పెల్లింగ్ బీ పోటీలను రద్దు చేశారు. 2019లో జరిగిన పోటీల్లో 8 మంది విజేతలుగా నిలవగా.. అందులో ఆరుగురు భారత సంతతికి చెందిన విద్యార్థులే కావటం విశేషం.
ఇదీ చదవండి:భారత్‌కు మరోసారి అమెరికా భారీ సాయం