తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ రెండింటిని జోడిస్తే.. రికవరీ రేటులో మార్పు ఎంత! - యాంటి ఇన్​ఫ్లమేటరీ చికిత్స బారిసిటినిబ్​

కరోనాపై పోరులో భాగంగా అమెరికాలోని నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​ ఓ పరిశోధనను ప్రారంభించింది. యాంటి వైరల్​ డ్రగ్​ రెమ్​డెసివిర్​ను యాంటి ఇన్​ఫ్లమేటరీ చికిత్స బారిసిటినిబ్​తో జోడించి రోగులకు అందించనుంది. దీని వల్ల రోగులు కోలుకునే సమయం, మరణాలపై ఏదైనా మార్పులు ఉంటాయా? లేదా? అన్న దానిపై ఈ పరిశోధనలు జరగనున్నాయి.

NIH undertakes study of antiviral remdesivir with anti-inflammatory drug to treat COVID-19
ఆ రెండింటిని జోడిస్తే.. రికవరీ రేటులో మార్పు ఎంత!

By

Published : May 10, 2020, 6:39 PM IST

కరోనాపై పోరులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు విస్తృతంగా జరుగుతున్నాయి. తాజాగా రెమ్​డెసివిర్​ను బారిసిటినిబ్​తో జోడించి.. రోగులకు చికిత్స అందించే విధంగా క్లీనికల్​ పరిశోధనలు జరుపుతున్నట్టు అమెరికా నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ హెల్త్​(ఎన్​ఐహెచ్​) ప్రకటించింది. వీటిని కలిపితే రోగుల రికవరీ రేటులో ఏ మేరకు వృద్ధి సాధించవచ్చనే విషయంపై పరిశోధనలు చేస్తున్నట్టు పేర్కొంది.

రెమ్​డెసివిర్​ అనేది గిలీడ్​ సైన్స్​ ఐఎన్​సీ తయారు చేసే ఓ యాంటీ వైరల్​ డ్రగ్​. బారిసిటినిబ్​ అనేది యాంటి ఇన్​ఫ్లమేటరీ చికిత్స.

ఈ పరిశోధన కోసం ప్రస్తుతం అమెరికాలో వైరస్​తో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి వివరాలను సేకరిస్తున్నారు. 1000 మందికి పైగా ఈ పరిశోధనలు జరపాలని పరిశోధకులు యోచిస్తున్నారు.

యాంటి ఇన్​ఫ్లమేటరీ ఏజెంట్ బారిసిటినిబ్​కు రెమ్​డెసివిర్​ను జోడిస్తే మరణాలు, రికవరీపై ఏమైనా ప్రభావం ఉంటుందా? అనే? దానిపై ప్రయోగాలు చేస్తున్నట్టు నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ అలర్జీ డైరక్టర్​​ అంథోనీ ఫౌచి తెలిపారు.

బారిసిటినిబ్​ బ్రాండ్​ పేరు ఓలిమైంట్​. దీనిని లిల్లీ అండ్​ కో సంస్థ తయారు చేస్తుంది. కరోనా వైరస్​ బాధితుల చికిత్సకు ఇది ఉపయోగపడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రయోగాలు జరుగుతున్నాయి.

రోగులకు తొలిరోజున రెమ్​డెసివిర్​ను 200 మిల్లి గ్రామ్​ ఐవీ డోస్​ అందిస్తారు. అనంతరం 100 ఎమ్​జీ ఐవీ డోస్​ను ఇస్తారు. ఇలా 10రోజులు పాటు అందిస్తారు. బారిసిటినిబ్​ను 14రోజుల పాటు 4 ఎమ్​జీ ఓరల్​ డోస్​గా రోగులకు ఇస్తారు.

అనంతరం రికవరీ సమయాన్ని పరిశీలిస్తారు. బారిసిటినిబ్​తో పాటు రెమ్​డెసివిర్​ను అందించి.. రోగులు ఎంత సమయంలో కోలుకుంటున్నారో లెక్కిస్తారు. ఈ ఫలితాలను... రెమ్​డెసివిర్​ ఒక్కదాన్నే వచ్చే ఫలితాలతో పోల్చుతారు.

ABOUT THE AUTHOR

...view details