తెలంగాణ

telangana

ETV Bharat / international

ఈ ఔషధంతో కరోనా చికిత్సపై చిగురించిన ఆశలు! - corona virus vaccine

అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్‌ఐహెచ్‌) నిర్వహించిన తాజా అధ్యయనంలో 'రెమ్డెసివిర్' అనే ఔషధం కరోనాపై సమర్థంగా పనిచేస్తుందని నిర్ధరించింది. అమెరికాలోని గిలీడ్ సైన్సెస్ అనే సంస్థ అభివృద్ధి చేసిన ఔషధంతో కరోనా చికిత్సపై ఆశలు చిగురిస్తున్నాయి.

corona
కరోనా వైరస్ చికిత్స

By

Published : Apr 30, 2020, 9:19 AM IST

కరోనా వైరస్ ఆటకట్టించేందుకు అమెరికాకు చెందిన గిలీడ్ సైన్సెస్​ అనే సంస్థ 'రెమ్డెసివిర్‌' అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఇది సమర్థంగా పనిచేస్తోందని జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్​ఐహెచ్​) నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది.

దీంతో కొవిడ్‌ బాధితులకు మెరుగైన చికిత్స అందించడంపై సర్వత్రా ఆశలు చిగురిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 800 మంది బాధితులకు ఈ ఔషధాన్ని అందించగా.. ఇతర మందులు వాడిన వారితో పోలిస్తే రెట్టింపు వేగంతో వారు కోలుకున్నారని అధ్యయనంలో తేలింది.

జర్మనీలో పరీక్షలు..

కరోనా నిర్మూలనే లక్ష్యంగా అమెరికాకు చెందిన ఫైజర్‌ సంస్థతో కలిసి తాము అభివృద్ధి చేసిన ‘బీఎన్‌టీ162’ అనే టీకాను మానవులపై పరీక్షించడం ప్రారంభించామని జర్మనీ కంపెనీ ‘బయోఎన్‌టెక్‌’ తెలిపింది. పరీక్షల్లో భాగంగా ఈ నెల 23 నుంచి ఇప్పటివరకు 12 మందికి దాన్ని అందించామని వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details