ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వచ్చే నాలుగు నుంచి ఆరు నెలల్లో మరింత తీవ్రంగా మారే అవకాశముందని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. అందువల్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అయితే నిబంధనలు కచ్చితంగా పాటిస్తే కొవిడ్ ముప్పును అరికట్టవచ్చని.. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు గేట్స్.
"విచారకరమైన విషయమేంటంటే... రానున్న 4-6 నెలల్లో కరోనా ప్రభావం మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ అంచనాల మేరకు మరో 2లక్షల మరణాలు సంభవించే అవకాశం ఉందన్నారు. అయితే మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి నిబంధనలను కచ్చితంగా పాటిస్తే ఈ మరణాల శాతాన్ని తగ్గించవచ్చు. ఇలాంటి మహమ్మారి గురించి 2015లోనే నేను హెచ్చరించాను. మరణాల రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పాను. అయితే.. అమెరికా సహా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలపై కొవిడ్ ప్రభావం నేను అంచనా వేసినదానికంటే తక్కువగానే ఉండటం ఆనందకరం." అని బిల్‌గేట్స్ చెప్పుకొచ్చారు. కొవిడ్ వ్యాక్సిన్ ప్రయోగాల కోసం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సంపూర్ణ సహకారం అందిస్తోందని గేట్స్ ఈ సందర్భంగా తెలిపారు.
ఇదీ చదవండి:'ఊపిరితిత్తుల కణాలను హైజాక్ చేస్తున్న కరోనా'
బహిరంగంగానే టీకా తీసుకుంటా..