తెలంగాణ

telangana

By

Published : Dec 1, 2021, 5:55 AM IST

ETV Bharat / international

ఆ నగరంలో మాదకద్రవ్యాల క్లబ్​లు.. వాడకాన్ని తగ్గించేందుకే!

మాదకద్రవ్యాల అతి వినియోగాన్ని అరికట్టేందుకు న్యూయర్క్ నగర అధికారులు వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. డ్రగ్స్ వినియోగించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లకు వచ్చేవారు డ్రగ్స్ వినియోగించినప్పటికీ పరిమితంగానే ఉంటుందని చెబుతున్నారు. అయితే వీటి ఏర్పాటును సామాజిక కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. డ్రగ్స్ వాడకం మరింత పెరిగిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

drugs
డ్రగ్స్ ల్యాబ్

అమెరికాలో మాదకద్రవ్యాల వినియోగంతో పాటు.. వ్యసనాన్ని అరికట్టడమే లక్ష్యంగా న్యూయర్క్​లో 'సురక్షిత డ్రగ్స్​ కేంద్రాలు' ప్రారంభమయ్యాయి. ఈ సెంటర్లలో హెరాయిన్​తో పాటు.. ఇతర మాదకద్రవ్యాలను అందుబాటులో ఉంటాయని నగర మేయర్ తెలిపారు. వీటిని ఉపయోగించే వ్యక్తులకు ఇవి సురక్షిత కేంద్రాలుగా పనిచేస్తాయని ఆరోగ్య అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సురక్షిత డ్రగ్స్​ కేంద్రం

ఈ కేంద్రాల్లో ఓ వ్యక్తి ఎంత మోతాదులో మాదకద్రవ్యాలను వినియోగిస్తున్నాడనే అంశాన్ని గుర్తిస్తారు. అలాగే పరిమితికి మించి ఉపయోగిస్తే సంకేతాలు అందించడం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

"డ్రగ్స్ బాధితుల కోసం చేసిన కృషిలో దశాబ్దాలుగా విఫలమయ్యాం. ఇన్నేళ్ల తర్వాత ఓ తెలివైన నిర్ణయం సాధ్యమైనందుకు గర్వపడుతున్నా. దేశంలోని ఇతర నగరాలకూ ఇవి విస్తరించాలని కోరుకుంటున్నా"

--బిల్ డి బ్లాసియో, న్యూయర్క్ మేయర్

న్యూయార్క్​ సహా.. అమెరికాలోని ఇతర నగరాల్లో పర్యవేక్షిత ఇంజక్షన్ సైట్‌లుగా 'డ్రగ్ సెంటర్ల' ఏర్పాటుపై ఎప్పటినుంచో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే కెనడా, ఆస్ట్రేలియా, ఐరోపాలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

అయితే.. ఈ కేంద్రాల ఏర్పాటు నైతికతను సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. విఫల ప్రయత్నంగా వీటిని అభివర్ణిస్తూ.. వీటి కారణంగా మరింత మంది బాధితులుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మాదకద్రవ్యాల ఉపయోగం కోసం ఒక స్థలాన్ని నిర్వహించడాన్ని ఫెడరల్ చట్టం నిషేధిస్తుందని గుర్తుచేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details