కరోనాపై భారత్ చేస్తోన్న పోరాటంలో కెనడా మద్దతుగా నిలిచింది. ఈ మేరకు 10 మిలియన్ డాలర్లను సాయంగా ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. మరే ఇతర సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదే విషయంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో తమ ప్రతినిధి సంభాషించినట్లు వివరించారు. తక్షణమే తాము కేటాయించిన మొత్తాన్ని ఇండియన్ రెడ్ క్రాస్‌కు పంపిస్తున్నట్లు పేర్కొన్నారు.
న్యూజిలాండ్ సాయం...
కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత్‌కు సాయం చేయడానికి న్యూజిలాండ్ ముందుకు వచ్చింది. ఈ మేరకు సుమారు 7,20,365 డాలర్లను రెడ్‌క్రాస్ అందజేస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి నానియా మహుటా బుధవారం ప్రకటించారు.