అమెరికా న్యూయార్క్ నగరం ప్రస్తుతం కరోనా వైరస్ కేంద్రస్థానంగా మారింది. నగరంలో ఇప్పటివరకు 5వేలకు పైగా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 43మంది ప్రాణాలు కోల్పోయారు.
న్యూయార్క్ రాష్ట్రంలో వైరస్ చేరుకున్న వారి సంఖ్య 7వేలకు చేరుకోనుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు గవర్నర్ ఆండ్ర్యూ క్యూమో. అనవసరమైన పనులు చెయ్యకుండా ఉండటం సహా 10 అంశాలతో కూడిన ఆంక్షలను అమలుచేయనున్నట్లు తెలిపారు.
అమెరికావ్యాప్తంగా 349మంది..
అమెరికాలో ఇప్పటివరకు 26, 500మందికి పైగా కరోనా సోకింది. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 7వేలమందికిపైగా పాజిటివ్‌గా తేలింది. గత 24 గంటల్లో 80మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా మృతుల సంఖ్య 340కి చేరింది.
ఇళ్లల్లో ఉండి ప్రాణాలు కాపాడుకోండి..