కరోనా కారణంగా గతంలో ఎన్నడూ చవిచూడని విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది అగ్రరాజ్యం అమెరికా. కరోనా కేసులలో ప్రపంచంలోనే ఇప్పుడు ప్రథమ స్థానంలో ఉంది. ప్రఖ్యాత న్యూయార్క్ నగరం వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైంది. ఆ ప్రాంతంలో నమోదైన కేసుల సంఖ్య చైనా, బ్రిటన్ను దాటిందంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
కేసుల సంఖ్యలో వ్యత్యాసం ఇలా..
- చైనా- 82,160
- బ్రిటన్- 84,279
- న్యూయార్క్- 1,88,694
న్యూయార్క్లో కరోనా విజృంభణపై నగర మేయర్ బిల్ డి బ్లాసియో ఆందోళన వ్యక్తం చేశారు. గతవారం పరిస్థితి భయానకంగా ఉందని చెప్పారు. ఒక్క రోజే 5,695 కేసులు నమోదు కాగా, 758మంది మృతిచెందినట్లు న్యూయార్క్ గవర్నర్ అండ్రూ క్యూమో వెల్లడించారు. కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్య కాస్త తగ్గినప్పటికీ ఐసీయూలో చేరుతున్న రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు పేర్కొన్నారు.