కరోనా కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది న్యూయార్క్ నగరం. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైంది. ఇప్పటికీ నగరంలో దుకాణాలు పాక్షికంగా తెరుచుకునేందుకు అధికారులు అనుమతించడం లేదంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
నగరంలో కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాతే ఆర్థిక, ఇతర కార్యకలాపాలను పాక్షికంగా పునరుద్ధరిస్తామని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లేసియో తెలిపారు. జూన్ రెండోవారంలో రీఓపెనింగ్ ఉండొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఏడు ఆరోగ్య ప్రమాణాల లక్ష్యాన్ని చేరుకుంటేనే అది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. వాటిని సాధించేందుకు అధికారులు కృషి చేస్తున్నారని వివరించారు.
ప్రభుత్వం నిర్ధేశించిన ఏడు లక్ష్యాలు
- మరణాల రేటు మూడురోజుల సగటును దాటకూడదు.
- రోజుకు ఐదుకు మించి మరణాలు ఉండకూడదు.
- లక్షమంది నివాసితులకు రెండు కేసులు మాత్రమే నమోదు కావాలి.
- ఆస్పత్రులలో 30 శాతం పడకలు అందుబాటులో ఉండాలి.
- ఐసీయూలలో 30శాతం పడకలు ఖాళీగా ఉండాలి.
- టెస్టింగ్ సామర్థ్యం పెరగాలి.
- కాంటాక్ట్ ట్రేసింగ్ పెరగాలి.