తెలంగాణ

telangana

ETV Bharat / international

హగ్స్​, షేక్​హ్యాండ్స్​తో శ్వేతసౌధం​లో మళ్లీ పాతరోజులు

శ్వేతసౌధంలో మాస్కులు తొలగిపోయాయి. సందర్శకుల నవ్వులు విరబూశాయి. కౌగిలింతలు కనువిందు చేశాయి. అతిథులకు ఆడంబర ఆహ్వానాలు లభించాయి. మొత్తంగా పాతరోజులు మళ్లీ తిరిగొచ్చాయి.

white house is back
హగ్స్​, షేక్​హ్యాండ్స్​తో శ్వేతసౌధం​లో పాతరోజులు

By

Published : May 22, 2021, 1:14 PM IST

కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన్ రికార్డు వేగంతో కొనసాగుతుండటం, ఆంక్షలు సడలించడం వల్ల అమెరికాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇందుకు శ్వేతసౌధమే ప్రత్యక్ష సాక్షాత్కారంగా నిలుస్తోంది. మహమ్మారికి ముందు రోజులను గుర్తు తెచ్చే విధంగా వైట్​హౌస్​లో పరిణామాలు మారిపోయాయి. సిబ్బంది సంఖ్య పెరిగింది. వార్తల కోసం వచ్చే రిపోర్టర్ల సంఖ్యపై పరిమితులు తొలగిపోతున్నాయి.

వి ఆర్ బ్యాక్!

గడిచిన వారం రోజుల్లో ఈ గణనీయమైన మార్పులు జరిగాయి. సందర్శకులు, అధికారులు ఆరు గజాల దూరం పాటించే అవసరం లేకుండా పోయింది. ఈ వాతావరణాన్ని అందరికంటే ఎక్కువగా అధ్యక్షుడు జో బైడెన్ ఆస్వాదిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆంక్షల సడలింపుపై కొన్ని వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ.. శ్వేతసౌధంలో మాత్రం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. "వి ఆర్ బ్యాక్" అంటూ వైట్​హౌస్ ప్రెస్ సెక్రెటరీ సైతం శుక్రవారం ప్రకటించారు.

మూన్ జే ఇన్​కు కమలా హారిస్ షేక్ హ్యాండ్

ఇదీ చదవండి:'శ్వేతసౌధంలో కరోనా విజృంభణకు ఆ సమావేశమే కారణం'

మే 13న ఆంక్షలను సడలిస్తూ బైడెన్ ప్రకటన చేశారు. రెండు డోసులు తీసుకున్నవారు మాస్కు ధరించాల్సిన అవసరం లేదని కేంద్ర అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం స్పష్టం చేసిన తర్వాత.. ఆయన మాస్కు లేకుండా దర్శనమిచ్చారు.

దక్షిణ కొరియా అధినేత సైతం

వరుసగా రెండోరోజూ శ్వేతసౌధంలోని అతిపెద్ద గది అయిన ఈస్ట్ రూమ్​ను తెరిచారు. అమెరికా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో తొలి 'మెడల్ ఆఫ్ హానర్​'ను ప్రదానం చేశారు. 70 ఏళ్ల క్రితం కొరియా యుద్ధంలో చూపిన ధైర్యసాహసాలకు గుర్తుగా 94 ఏళ్ల రిటైర్డ్ కర్నల్ రాల్ఫ్ పకెట్ జూనియర్​కు ఈ పురస్కారాన్ని అందించారు. అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది. అమెరికా పర్యటనలో ఉన్న దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్ సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇరువురు నేతలు రాల్ఫ్​కు పలుమార్లు హ్యాండ్ షేక్ ఇచ్చారు. యుద్ధవీరుడి కుటుంబీకులతో ఫొటోలు దిగారు.

యుద్ధవీరుడి పక్కన నిల్చున్న బైడెన్. మూన్ జే ఇన్ ప్రసంగం

ఇదీ చదవండి:వైట్​హౌస్​కు 'కొత్త' రూల్స్- పక్కాగా అమలు

కౌగిలింతల కోలాహలం

అంతకుముందు రోజే ఈ గదిలో ఓ భారీ కార్యక్రమం జరిగింది. చట్టసభ్యుల సమక్షంలో.. ఆసియా అమెరికన్లపై నేరాలకు వ్యతిరేకంగా రూపొందిన బిల్లుపై బైడెన్ సంతకం చేశారు. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ, సహా ఇతర చట్టసభ్యులు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం కూడా ఈ కార్యక్రమంలో చూడొచ్చు.

బైడెన్ కౌగిలింత
చట్టసభ్యులు పాల్గొన్న కార్యక్రమంలో బైడెన్

"షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడం, అవతలి వ్యక్తుల చిరునవ్వులను చూసే అవకాశం రావడం ఈ కార్యక్రమంలో ఓ మంచి అనుభూతి" అంటూ సెనేటర్ సుసాన్ కొలిన్స్ చెప్పారు. కార్యక్రమం నుంచి వెళ్లిపోయే ముందు బైడెన్ సైతం పలువురికి షేక్ హ్యాండ్ ఇచ్చారు.

బైడెన్ ప్రసంగం.. ఎదురుగా చట్టసభ్యులు
చట్టసభ్యుల మధ్య సంతకం చేస్తున్న బైడెన్

అప్పటితో పోలిస్తే..

ఇలా శ్వేతసౌధం మళ్లీ మునుపటి వైభవాన్ని సంతరించుకుంటోంది. పూర్తిస్థాయి సిబ్బందితో కళకళలాడుతోంది. కొందరైతే అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో ఉన్న పరిస్థితులను ఇప్పటితో పోల్చుకుంటున్నారు. వైరస్ భయాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపిన క్షణాలను గుర్తుకు తెచ్చుకుంటున్నారు. ఏదేమైనా ప్రస్తుత క్షణాలను ఆనందంగా ఆస్వాదిస్తున్నారు.

ఇదీ చదవండి:శ్వేతసౌధాన్ని తాకిన కరోనా.. ట్రంప్​ సేఫ్​

ABOUT THE AUTHOR

...view details