అక్రమ వలసదారులు తమ దేశ పౌరసత్వం పొందటానికి అనర్హులుగా ప్రకటించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది అగ్రరాజ్యం అమెరికా. చట్టపరంగా వచ్చే వలసదారులను ప్రోత్సహించే విధంగా ఈ నిబంధనలు ఉంటాయని అమెరికా అధికారులు తెలిపారు. కొత్త నిబంధనలు అక్టోబరు నుంచి అమలయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇక అమెరికా పౌరసత్వం పొందటం కష్టమే..!
అగ్రరాజ్యం అమెరికా పౌరసత్వ నిబంధనలను కఠినతరం చేసే దిశగా నిర్ణయం తీసుకుంది. ఉచిత ప్రభుత్వ సేవలు పొందుతూ దేశానికి భారమయ్యే వలసదారులను నియంత్రించే విధానాలను అమలు చేయాలని నిర్ణయించినట్లు అమెరికా అధికారులు వెల్లడించారు. నూతన నిబంధనలు అక్టోబర్ నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
అమెరికా గ్రీన్ కార్డు నిబంధనలు కఠినతరం
ఏటా 5 లక్షల 44 వేల మంది గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో 36 నెలల కాలంలో 12 నెలల పాటు ప్రభుత్వ సేవలను పొందిన వారిని ఈ నిషేధిత జాబితాలో చేర్చనున్నారు. ఓ వ్యక్తి ఒక నెలలో రెండు ప్రభుత్వ సేవలను ఒకేసారి పొందినట్లయితే వాటిని రెండు నెలలుగా పరిగణిస్తారు.
ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని పలువురు విమర్శిస్తున్నారు. ఇక నుంచి అమెరికాలో స్థిరపడాలనుకునే వారు.. వారి కుటుంబ సభ్యులతో ఉండకుండా ఈ నిబంధనలు రూపొందిస్తున్నారని ఆరోపించారు.
Last Updated : Sep 26, 2019, 7:30 PM IST