కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టే దిశగా అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కును ఆవిష్కరించారు. కాటన్‌తో తయారుచేసిన ఆ మాస్కును గంట సేపు సూర్యకాంతిలో ఉంచితే చాలు. దాని ఉపరితలంపై ఉన్న 99.99శాతం బ్యాక్టీరియా, వైరస్లు నశించిపోతాయి.
ఈ మాస్కును ఎండలో ఉంచితే మహమ్మారి మాయం! - reactive oxygen species theory in masks
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ మహమ్మారిని అరికట్టేందుకు అమెరికా శాస్త్రవేత్తలు సరికొత్త మాస్కును రూపొందించారు. సూర్యకాంతి తాకితే మాస్కుపై ఉన్న సూక్ష్మజీవులు హతమయ్యే విధంగా సరికొత్త మాస్కును ఆవిష్కరించారు.
నూతన మాస్కు అభివృద్ధిలో భాగంగా శాస్త్రవేత్తలు తొలుత సాధారణ కాటన్‌కు ధనావేశంతో కూడిన 2-డైఇథైలమైనోఇథైల్ క్లోరైడ్ గొలుసులను అనుసంధానించారు. అనంతరం, కాంతి ప్రసరించినప్పుడు రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసిస్(ఆర్వోఎస్)లను విడుదల చేసే రుణావేశ ద్రావణంలో దానిని ముంచారు. ఫలితంగా సూర్యరశ్మి ప్రభావంతో మాస్కు నుంచి ఆర్వోఎస్లు విడుదలవుతాయని..అవి సూక్ష్మజీవులను క్రియారహితంగా మార్చేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వరుసగా ఏడు రోజులపాటు ఎండలో ఉంచినా మాస్కు దెబ్బతినదని చెప్పారు. పునర్వినియోగానికి అది అనుకూలంగా ఉంటుందని వివరించారు.
TAGGED:
latest scientific masks