కేవలం ఒక్క సెకనులోనే కరోనా ఫలితాన్ని తెలిపే కొత్త సెన్సార్ సిస్టంను శాస్త్రవేత్తలు రూపొందించారు. ప్రస్తుతం కరోనా పరీక్షలను జరిపే పద్ధతుల కంటే దీని ద్వారా వేగంగా ఫలితాలను తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనికి సంబంధించిన సమాచారం వాక్యూమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీ, అనే జర్నల్‌లో ప్రచురితం అయింది.
పరీక్ష ఇలా..
కరోనా వైరస్‌ను గుర్తించడానికి, వైరల్ బయోమార్కర్స్ను పెంచాల్సి ఉంటుంది. అంటే జన్యుపదార్థాల కాపీలను పెంచాలి. దీనికోసం పాలిమరైజ్ చైన్ రియాక్షన్(పీసీఆర్) లేదా ఏ జన్యుపదార్థాన్నైతే గుర్తించాలనుకున్నమో దానికోసం బైండింగ్ సిగ్నల్‌ను పెంచాలి.