మానవ శరీరంలోకి చొరబడేందుకు వీలుగా కరోనా వైరస్‌లో ఉన్న కీలకమైన నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని పనిచేసే ఓ వ్యాక్సిన్ తయారీకి మార్చిలో అమెరికా పేటెంట్ ఇచ్చింది. టెల్ అవీవ్ విశ్వవిద్యాలయం పరిశోధకుడు జోనాథన్ గెర్షోని రూపొందిందిన ఈ డిజైన్‌తో వ్యాక్సిన్ సిద్ధంకావడానికి ఏడాది లేదా ఏడాదిన్నర సమయం పడుతుందని సమాచారం.
ఈ వ్యాక్సిన్ కరోనా వైరస్ కీలుని లక్ష్యంగా చేసుకుంsటుంది. మానవ కణాలను పట్టుకొనేలా చేసే వైరస్‌పై ఉండే కొమ్ము లాంటి భాగం (స్పైక్)లోని నిర్మాణం (రెసెప్టార్ బైండింగ్ మోటిఫ్ -ఆర్‌బీఎం)పై పనిsచేస్తుంది.