మానవ కణాల్లోకి ప్రవేశించకుండా కరోనా వైరస్‌ను అడ్డుకునే సరికొత్త పదార్థాన్ని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. దీని పేరు 'ఎంఎం 3122'. మనిషి జీవకణాల్లోకి చొచ్చుకెళ్లేలా వైరస్‌ను అనుమతిస్తున్న ట్రాన్స్‌మెంబ్రేన్ సెరైన్ ప్రొటీన్-2 అనే మాంసకృత్తును ఈ కొత్త పదార్థం సమర్థంగా అడ్డుకుంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనితో యాంటీవైరల్ ఔషధాన్ని రూపొందిస్తే.. కొవిడ్ బాధితుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగదని, మరణముప్పు దూరమవుతుందని పరిశోధనకర్త జేమ్స్ జనెట్కా చెప్పారు.
కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా కరోనా వైరస్‌కు అడ్డుకట్ట! - కణాల్లోకి చొచ్చుకెళ్లకుండా వైరస్‌కు అడ్డుకట్ట
కరోనా వైరస్‌ను అడ్డుకునే సరికొత్త పదార్థాన్ని అమెరికా శాస్త్రవేత్తలు రూపొందించారు. దీనితో యాంటీవైరల్ ఔషధాన్ని రూపొందిస్తే.. కొవిడ్ బాధితుల్లో ఇన్ఫెక్షన్ తీవ్రత పెరగదని, మరణముప్పు దూరమవుతుందని పరిశోధకులు వెల్లడించారు.
"కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, కరోనా ముప్పు తప్పడం లేదు. మహమ్మారి నుంచి బాధితులను రక్షించేందుకు సరైన ఔషధాలను అందించాల్సి ఉంది. ఆ దిశగా పరిశోధన సాగించి, కొత్త రసాయన పదార్థాన్ని తయారుచేశాం. ఊపిరితిత్తులపై ఉండే ట్రాన్స్‌మెంబ్రేన్ సెరైన్ ప్రొటీన్-2, మట్రిప్టాస్ ప్రొటీన్లు కరోనా వైరస్‌ను ఆహ్వానించి, మానవ కణాలు ఇన్ఫెక్షన్కు గురయ్యేందుకు అడ్డుకుని, ఇన్ఫెక్షన్ను విస్తరించనివ్వదు" అని జేమ్స్ తెలిపారు. ఈ పరిశోధన వివరాలను ప్రొసీడింగ్స్ ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పత్రిక అందించింది.
ఇదీ చూడండి :'అఫ్గాన్ నుంచి ఏం కోరుకుంటున్నామో అప్పుడే చెప్పాం'