తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలోనూ కోలుకున్న వ్యక్తికి కరోనా - అమెరిాకాలో కరోనా పునరాగమన కేసు

హాంకాంగ్​, యూరప్​తో పాటు అమెరికాలోనూ కరోనాను జయించిన వారికి మళ్లీ వైరస్ సోకుతున్నట్లు నెవాడ అధికారులు వెల్లడించారు. ఏప్రిల్​లో కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి జూన్​లో మరోసారి పాజిటివ్​గా నిర్థరణ అయినట్లు పేర్కొన్నారు. రెండోసారి వైరస్ సోకిన వారు అనారోగ్యం బారినపడితే వారి పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపారు.

Nevada man may be 1st virus reinfection in US
అమెరికాలోనూ వెలుగు చూసిన కరోనా పునరాగమన​ కేసు

By

Published : Aug 29, 2020, 1:50 PM IST

హాంకాంగ్, యూరప్​లో కరోనా నుంచి కోలుకున్న వారు తిరిగి వైరస్ బారినపడినట్లు నివేదికలు వచ్చిన వేళ.. అమెరికాలో తొలి కరోనా వైరస్ రీ ఇన్ ఫెక్షన్ కేసు వివరాలను నెవాడ అధికారులు వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో 25 ఏళ్ల వ్యక్తికి ఏప్రిల్​లో కరోనా సోకగా.. అనంతరం కోలుకున్నాడు. అతనికే జూన్ లో మరోసారి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. న్యూమెనియోతో ఆసుపత్రిలో చేరిన అతనికి ఆక్సిజన్ చికిత్స అందించినట్లు నెవడా స్టేట్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మార్క్ పండోరి తెలిపారు.

రెండు సార్లు వైరస్ ఒకటే అయినప్పటికీ జన్యుపరంగా కొన్ని మార్పులు గమనించినట్లు చెప్పారు. అయితే ఆ వ్యక్తి తల్లిదండ్రుల్లో ఒకరికి జూన్​లో కరోనా సోకిందని తెలిపిన డైరెక్టర్.. ఆ విధంగా అతను తిరిగి వైరస్ బారినపడినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన పరిశోధన వ్యాసాలను ఎక్కడా ప్రచురించలేదన్న పండోరి.. వైరస్ బారి నుంచి కోలుకున్న వారు తిరిగి అనారోగ్యం బారినపడితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని తెలిపారు

ABOUT THE AUTHOR

...view details