తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 2.34 కోట్లు దాటిన కరోనా కేసులు - corona update

కరోనా మహమ్మారి విలయంలో ప్రపంచదేశాలు విలవిల్లాడుతున్నాయి. వైరస్​ విజృంభణతో రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2.34కోట్లు దాటింది. 8.09లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, బ్రెజిల్​, రష్యాల్లో వైరస్​ ఉద్దృతి ఎక్కువగా ఉంది. సింగపూర్​, నేపాల్​లో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది.

coronavirus cases
ప్రపంచవ్యాప్తంగా 2.34 కోట్లు దాటిన కరోనా కేసులు

By

Published : Aug 23, 2020, 7:56 PM IST

ప్రపంచంపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 2కోట్ల 34లక్షలకుపైగా మంది వైరస్​ బారిన పడ్డారు. 8.09 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో కోటీ 59లక్షలకుపైగా వైరస్​ నుంచి కోలుకోవటం ఊరట కలిగిస్తోంది.

మొత్తం కేసులు: 2,34,10,988

మరణాలు: 8,09,142

కోలుకున్నవారు: 1,59,43,510

యాక్టివ్​ కేసులు: 66,58,336

  • అమెరికాలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది. 58.42 లక్షల మంది వైరస్​ బారినపడగా.. 31.48లక్షల మంది కోలుకున్నారు. 1.80లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో వైరస్​ ఉద్ధృతి తగ్గడం లేదు. 35.83లక్షల మందికి వైరస్​ సోకింది. లక్షా 14వేలకుపైగా వైరస్​కు బలయ్యారు. ఇప్పటి వరకు 27.09లక్షల మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • నేపాల్​లో రికార్డు స్థాయిలో ఆదివారం 818 కొత్త కేసులు నమోదయ్యాయి. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 31,935కు, మరణాల సంఖ్య 149కి చేరింది. కొత్త కేసుల్లో కాఠ్మాండులోనే 166 ఉన్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 18,631 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • సింగపూర్​లో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా​ను పూర్తిస్థాయిలో అరికట్టినట్లు ప్రకటించిన నెలరోజుల తర్వాత దేశంలోని అతిపెద్ద విదేశీ కార్మికుల వసతి గృహంలో కొత్త కరోనా క్లస్టర్​ను గుర్తించారు. ఇందులో భారతీయులు కూడా ఉన్నారు. సింగపూర్​లో ఆదివారం కొత్తగా 87మంది వైరస్​ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 56,353కు చేరింది.
  • పాకిస్థాన్​లో కొత్తగా 591 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,92,765కు చేరింది. ఆదివారం నలుగురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,235కు చేరింది. 2,75,836 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.

ప్రపంచ దేశాల్లో కేసుల వివరాలు ఇలా..

దేశం కేసులు మరణాలు
అమెరికా 58,42,153 1,80,191
బ్రెజిల్​ 3,583,308 114,287
రష్యా 9,56,749 16,383
దక్షిణాఫ్రికా 6,07,045 12,987
పెరూ 5,85,236 27,453
మెక్సికో 5,56,216 60,254
కొలంబియా 5,33,103 16,968
స్పెయిన్​ 4,07,879 28,838
చిలీ 3,95,708 10,792

ఇదీ చూడండి: 7.67శాతానికి తగ్గిన కరోనా పాజిటివ్​ రేటు

ABOUT THE AUTHOR

...view details