Colorado Fire: అమెరికాలోని కొలరాడో రాష్ట్రం భయాందోళనల మధ్యే నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గతేడాది డిసెంబరు 30న చెలరేగిన కార్చిచ్చుకు దాదాపు వెయ్యి ఇళ్లు కాలిపోయాయి. ముఖ్యంగా డెనెవర్, బౌల్డర్ మధ్య ఉన్న కౌంటీలపై ఈ కార్చిచ్చు ప్రభావం తీవ్రంగా ఉంది. అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. కానీ ముగ్గురు ఆచూకీ గల్లంతైంది. వీరి కోసం అధికారులు గాలిస్తున్నారు. ఈ కార్చిచ్చుకు గల కారణాలపై ఇంకా తెలియాల్సి ఉంది.
కార్చిచ్చు ధాటికి మొత్తం 991 ఇళ్లు కాలిపోయాయి. లూయిస్విల్లీలో 553, సుపీరియర్లో 332 సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో 106 ఇళ్లు మంటలకు బూడిదయ్యాయి. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు.
అంతలోనే మంచు..